Credit Card యూజర్లకు బ్యాడ్ న్యూస్.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. పూర్తి వివరాలివే..

Court on Credit Cards: భారతదేశంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఏటేటా పెరిగిపోతున్నారు. వాస్తవానికి బ్యాంకింగ్ రంగం, డిజిటలైజేషన్ విస్తరిస్తున్న వేళ కార్డ్ యూజర్లు కూడా పెరుగుతున్నారు. తాజాగా వీటికి సంబంధించిన కీలక ప్రకటన వచ్చింది.

దేశంలోని లక్షలాది మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లపై ప్రభావం చూపే తీర్పును తాజాగా సుప్రీం కోర్టు వెలువరించింది. వాస్తవానికి క్రెడిట్ కార్డ్ బిల్లులు ఆలస్యంగా చెల్లింపుపై వడ్డీ రేటును ఏటా 30 శాతానికి పరిమితం చేస్తూ 2008 నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్(NCDRC) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు డిసెంబర్ 20న రద్దు చేసింది. తాజా రూలింగ్ కారణంగా ఇకపై క్రెడిట్ కార్డులు జారీ చేసిన ఆర్థిక సంస్థలు పెద్ద మెుత్తంలో వడ్డీ వసూలు చేసుకొనేందుకు బ్యాంకులకు మార్గం సుగమమైంది. కాబట్టి క్రెడిట్‌ కార్డు వాడకందారులు ఇక నుంచి సకాలంలో బిల్లు చెల్లించడం మంచిది. ఎందుకంటే ఇకపై ఆలస్యపు బిల్లు చెల్లింపులపై భారీగా వడ్డీ కట్టాల్సి ఉంటుందని వెల్లడైంది.

Supreme court in latest ruling shocked credit card users cc interest rates to rise

గతంలో నేషనల్ కాన్స్యూమర్ కమిషన్ 2008లో తీర్పును సవాలు చేస్తూ.. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హాంకాంగ్, షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ బ్యాంకులు కోర్టులో సవాలు చేశాయి. న్యాయమూర్తులు బేలా త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశాయి. గతంలో 25 మార్చి 2008 ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీం కోర్ట్ తీసుకున్న నిర్ణయాన్ని దేశంలో క్రెడిట్ కార్డ్‌ల స్వరూపాన్ని స్పష్టంగా మారుస్తుంది. సుప్రీం కోర్టు తాజా రూలింగ్ ప్రకారం ఇకపై దేశంలో క్రెడిట్ కార్డులను జారీ చేసిన బ్యాంకులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేట్లను నిర్ణయించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

క్రెడిట్ కార్డ్ హోల్డర్లు జర భద్రం..
క్రెడిట్ కార్డ్ యూజర్లు బ్యాంకింగ్ లేదా ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీ రేట్ల పెనాల్టీ భారాలను నివారించటానికి సకాలంలో క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించటం ఉత్తమం. ఈ క్రమంలో యూజర్లు తదనుగుణంగా డబ్బును సిద్ధం చేసుకుని కార్డు చెల్లింపులను చేపట్టడం మంచిది. క్రెడిట్ కార్డ్‌లను సకాలంలో తిరిగి చెల్లించడానికి వ్యూహాలను అభివృద్ధి చేయడం, వడ్డీ రేట్లకు సంబంధించిన నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకులు అందించే 45 రోజుల వడ్డీ రహిత గడువును వినియోగించుకుని సకాలంలో బిల్లులను చెల్లించటం కార్డు దారుల క్రెడిట్ స్కోర్ కూడా మెరుగ్గా ఉంటుంది.

2008లో కేసు తీర్పు ఏంటి..?
క్రెడిట్‌ కార్డు బిల్లుల ఆలస్య చెల్లింపులపై వార్షికంగా 30 శాతానికి మించి వడ్డీ వసూలు చేయరాదని NCDRC 2008లో తీర్పు వెలువరించింది. ఆలస్య చెల్లింపులపై బ్యాంకులు 36-49 శాతం మేర వడ్డీ వసూలు చేస్తుండడంపై ఆవాజ్‌ ఫౌండేషన్‌ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన సమయంలో వడ్డీ రేటుపై పరిమితి పెంచుతూ తీర్పు వెలువరించింది. దీంతో దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ కమిషన్‌ ఆదేశాలను తాజాగా సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ఇక నుంచి ఆలస్యపు చెల్లింపులపై వడ్డీ రేటు 30 శాతం పరిమితి వర్తించదని కోర్టు తన తాజా రూలింగ్ లో వెల్లడించింది. వాస్తవానికి ఇది ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు పెద్ద షాకింగ్ వార్తని చెప్పుకోవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+