పిల్లలు పుట్టాక ఖర్చులు కూడా మెల్లి మెల్లిగా పెరుగుతాయి. అలాగే వారు ఎదుగుతున్న కొద్దీ విద్య, వైద్య ఖర్చులు కూడా ఉంటాయి. ఒక సామాన్యుడి నెల జీతంతో ఇవన్నీ గడిచిన పెళ్ళికి మాత్రం కొంత పెద్ద మొత్తం డబ్బు కావాల్సిందే. అంతే కాకూండా ఈ రోజుల్లో పెళ్లి ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. మరోపక్క కూతురి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పెళ్లికి అయ్యే ఖర్చులు పేద లేదా మధ్యతరగతి తల్లిదండ్రులకు చాలా ఆందోళన కలిగిస్తాయి. కానీ మీరు కొంచెం తెలివిగా ఆలోచించి సమయానికి పెట్టుబడి పెడితే మీరు ఈ టెన్షన్ నుండి బయటపడవచ్చు. అవును నిజమే... ఇందుకు మీరు మీ పిల్లల భవిష్యత్తు ఖర్చులైన ఉన్నత విద్య, పెళ్లి మొదలైన వాటి కోసం వారి చిన్నతనం నుండే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. ఆడపిల్లల కోసం ప్రభుత్వం నుండి చాలా మంచి పథకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కిం పతి ఒక్క ఆడపిల్లకు లభిస్తుంది. ఇంకా ఈ స్కిం వడ్డీ రేటు గురించి మాటాడితే ప్రస్తుతం ఈ పథకంకి 2024గాను 8.2 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు.

అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చెయ్యాలి
సుకన్య సమృద్ధి యోజన కింద తల్లిదండ్రులు వారి కుమార్తెకు 10 ఏళ్లు నిండకముందే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒక పెట్టుబడిదారుడు తన కుమార్తె పుట్టిన వెంటనే ఈ పథకంలో అకౌంట్ (SSY account) తెరిస్తే అతను 15 సంవత్సరాల పాటు తన సహకారాన్ని డిపాజిట్ చేయవచ్చు. అమ్మాయికి 18 ఏళ్లు నిండినప్పుడు మెచ్యూరిటీ మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే కుమార్తెకు 21 ఏళ్లు నిండిన తర్వాత మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
మీరు 21 సంవత్సరాల వయస్సులో 64 లక్షలు
మీరు సుకన్య సమృద్ధి అకౌంట్లో ప్రతి నెలా రూ. 12,500 జమ చేస్తే, ఈ మొత్తం ఏడాదికి రూ. 1.5 లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. మెచ్యూరిటీపై ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతంగా తీసుకుంటే పెట్టుబడిదారుడి తన కుమార్తె కోసం మెచ్యూరిటీ వరకు ఎక్కువ మొత్తం సిద్ధం చేయవచ్చు. పెట్టుబడిదారుడు కుమార్తెకు 21 ఏళ్లు నిండిన తర్వాత మొత్తం ఒకేసారి విత్‌డ్రా చేస్తే, మెచ్యూరిటీ మొత్తం రూ.64 లక్షల వరకు అవుతుంది. ఇందులో పెట్టుబడిదారుడు పెట్టుబడి పెట్టిన మొత్తం సుమారు 30లక్షలు. ఇది కాకుండా వడ్డీ ఆదాయం కూడా లభిస్తుంది . ఈ విధంగా సుకన్య సమృద్ధి అకౌంట్లో ప్రతి నెలా రూ.12,500 జమ చేస్తే మీ కుమార్తెకు 21 ఏళ్లు వచ్చేసరికి దాదాపు రూ.64 లక్షలు వస్తాయి. అయితే విత్‌డ్రా సమయంలో వడ్డీ రేటు బట్టి కూడా మీ మెచూరిటీ మొత్తం మరింత పెరగవచ్చు.
పన్ను కూడా ఆదా అవుతుంది
పెట్టుబడిదారులు సుకన్య సమృద్ధి యోజనలో సంవత్సరానికి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పథకంలో ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. సుకన్య సమృద్ధి యోజన EEE హోదాతో వస్తుంది. అంటే మూడు చోట్ల పన్ను మినహాయింపు లభిస్తుంది. సుకన్య సమృద్ధి పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీ కూడా పన్ను రహితం. అంతే కాకుండా, ఈ పథకంలో మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications