నెల రోజుల్లోనే ఈ స్టాక్స్ దుమ్మురేపాయి, రెండింతల లాభాలు ఇచ్చాయి
మిశ్రమ గ్లోబల్ సంకేతాలు ఉన్నప్పటికీ భారత మార్కెట్ దీపావళి వారాన్ని బలంగా ముగించింది. నవంబర్ నాలుగో తేదీన ముహూరత్ ట్రేడింగ్ మరింత బలంగా ముగిసింది. రెండు వారాలుగా నష్టపోయిన మార్కెట్లు, గతవారం మాత్రం లాభాల్లో ముగిశాయి. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1.28 శాతం లాభపడి 60,067.62 డాలర్ల వద్ద, నిఫ్టీ 50 స్టాక్ 1.38 శాతం ఎగిసి 17916.8 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. కొన్ని స్టాక్స్ మల్టీ బ్యాగర్లుగా నిరూపించుకుంటూ ఒకే నెలలో రెట్టింపు కంటే ఎక్కువ వృద్ధిని సాధించాయి. అలాంటి వాటిలో కీరన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆక్టాల్ క్రెడిట్ క్యాపిటల్, రఘువీర్ సింథటిక్ ఉన్నాయి.

ఒక నెలలో మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్
నెల రోజుల్లో అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఇవే...
- కీరన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ - స్టాక్ తాజా ధర రూ.42.25 - నెలలో వృద్ధి 127.76%,
- రాధే డెవలపర్ - స్టాక్ తాజా ధర రూ.173.10 - నెలలో వృద్ధి 151.60%,
- ఆక్టాల్ క్రెడిట్ క్యాపిట్ - స్టాక్ తాజా ధర రూ.70.20 - నెలలో వృద్ధి 150.27%,
- చార్టర్డ్ లాజిస్టిక్స్ - స్టాక్ తాజా ధర రూ.19.45 - నెలలో వృద్ధి 139.53%,
- రఘువీర్ సింథటిక్ - స్టాక్ తాజా ధర రూ.186.70 - నెలలో వృద్ధి 152.40%.

ఈ స్టాక్స్ అదుర్స్
కీరన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వార్షిక వృద్ధి 64.23 శాతంగా నమోదయింది. ఈ కంపెనీ మూడేళ్ల CAGR 20.91 శాతాన్ని అధిగమించింది. కీరన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 1994లో స్మాల్ క్యాప్ బిజినెస్‌గా ప్రారంభమైంది. నేరుగా ఫైనాన్షియల్ రంగంలోకి అడుగు పెట్టింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.45.12 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ ఏడాది పనితీరు విషయానికి వస్తే సెన్సెక్స్‌తో 994 శాతం లాపడింది. ఇటీవలి త్రైమాసికంలో ఈ కంపెనీ గ్రాస్ సేల్స్ రూ.10.38 కోట్లు, మొత్తం ఆదాయం రూ.10.45 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ గత మూడేళ్లలో 895 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అదే నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 కేవలం 74.57 శాతం రిటర్న్స్ మాత్రమే ఇచ్చింది.
ఆక్టాల్ క్రెడిట్ క్యాపిట్ 1992లో స్మాల్ క్యాప్ బిజినెస్‌గా ప్రారంభమైంది. ఫైనాన్షియల్ సర్వీస్ రంగంలోకి అడుగు పెట్టింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.35.11 కోట్లు. ఈ కంపెనీ ఆపరేషనల్ రెవెన్యూ ఒక శాతం కంటే తక్కువగా ఖర్చు చేసింది. ఈ స్టాక్ ఏడాది పనితీరు 1274 శాతం. ఈ స్టాక్ మూడేళ్ల కాలంలో 183.94 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అదే సమయంలో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 మాత్రం 74.57 శాతం రిటర్న్స్ మాత్రమే ఇచ్చాయి.

రఘువీర్ సింథటిక్స్
రఘువీర్ సింథటిక్ యాన్యువల్ సెల్స్ గ్రోత్ 90.98 శాతంగా ఉంది. ఈ స్టాక్ మూడేళ్ల కాలంలో 918 శాతం రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 మాత్రం ఇదే కాలంలో 74.57 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. అయిదేళ్ల కాలంలో 5000 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఆరు నెలల కాలంలో 776 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడిన అంశం. ఈక్విటీల్లో పెట్టుబడి పెడితే లాభపడవచ్చు. నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి స్టాక్స్, మార్కెట్ పైన అవగాహనతో, నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేయాలి.


Click it and Unblock the Notifications