అక్టోబర్ నెలలో ఈ స్టాక్ 42 శాతం రిటర్న్స్ ఇచ్చింది తెలుసా?
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI) స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. ఈ స్టాక్ రూ.50 క్రాస్ చేసింది. నేడు UBI స్టాక్ రూ.48.50 వద్ద ప్రారంభమై, రూ.51.70 వద్ద గరిష్టాన్ని, రూ.48.15 కనిష్టాన్ని తాకింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.51.70. 52 వారాల కనిష్టం రూ.23.45. క్రితం సెషన్‌లో రూ.47.70 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టానికి చేరుకున్నది నేడు. ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనమైన విషయం తెలిసిందే. UBI స్టాక్ గత ఐదు సెషన్‌లలో దాదాపు 12 శాతం లాభపడింది.
నెలలో 43 శాతానికి పైగా, ఆరు నెలల్లో 55 శాతం, ఏడాదిలో 108 శాతం, ఇయర్ టు డేట్ (2021 క్యాలెండర్ ఏడాది) 56.85 శాతం లాభపడింది. ఈ స్టాక్ పదేళ్ల క్రితం రూ.400కు సమీపంలో ఉంది. అయితే అప్పటి నుండి క్రమంగా క్షీణిస్తోంది. అయిదేళల్ క్రితం కూడా రూ.150కి పైనే ఉంది. కానీ ఆ తర్వాత ఓ సమయంలో రూ.24 దిగువకు పడిపోయింది. తిరిగి క్రమంగా పుంజుకుంటూ ఇప్పుడు రూ.50కి పైన ఉంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ అక్టోబర్ నెలలోనే 43 శాతానికి పైగా లాభపడింది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు ఈ బ్యాంకు రేటింగ్‌ను నెగిటివ్ నుండి స్టేబుల్‌కు మార్చాయి. దీంతో ఈ స్టాక్ అప్పటి నుండి పరుగులు పెడుతోంది. ఏప్రిల్-జూన్ (Q1FY22) త్రైమాసికంలో బ్యాంకు గ్రాస్ నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ (NPA) రేషియో ఏడాది ప్రాతిపదికన 135 బేసిస్ పాయింట్లు తగ్గి 13.60 శాతంగా ఉంది.

నెట్ ఎన్పీఏ కూడా జూన్ 30వ తేదీ నాటికి ఏడాది ప్రాతిపదికన 28 బేసిస్ పాయింట్లు తగ్గి 4.69 శాతానికి క్షీణించింది. క్రెడిట్ కాస్ట్ త్రైమాసికం ప్రాతిపదికన 135 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ వరుసగా 31.45 శాతం, 254.93 శాతం పెరిగాయి. నెట్ ఇంటరెస్ట్ ఇన్‌కం ఆఫ్ బ్యాంకు 9.53 శాతం పెరిగింది.
కేంద్ర ప్రభుత్వం వరుసగా క్యాపిటల్ ఇన్‌ఫ్యూజన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మద్దతు ఇస్తోందని చెబుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బ్యాంకు గణనీయస్థాయి కార్యకలాపాల వంటి మద్దతు స్టాక్‌కు ఉందని చెబుతున్నారు. ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకుల విలీనం తర్వాత బ్యాంకు మూలధనం పెరిగింది. ఇది బ్యాంకు క్యాపిటలైజేషన్‌ను పెంచింది.


Click it and Unblock the Notifications