స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, టీసీఎస్ తదితర ఎన్నో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక్కో షేర్‌కు వేల రూపాయలు కేటాయించాలి. వందల్లోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది మొగ్గు చూపుతారు. అయితే సింగిల్ డిజిట్ స్టాక్స్ కోసం చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఇందులో చాలామంది తీరు వస్తే వస్తుంది.. పోతే పోతుంది.. అనే పద్ధతిలో ఉంటుంది. అందుకే సింగిల్ డిజిట్ స్టాక్స్ వైపు చూస్తారు. అలాంటి సింగిల్ డిజిట్ స్టాక్స్ కొన్ని చూద్దాం...
సుజ్లాన్ ఎనర్జీ, జేపీ పవర్ వెన్, రతన్ ఇండియా పవర్, జేపీ అసోసియేట్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎప్‌సీఎస్ సాఫ్టువేర్, మంగళం ఇండస్ట్రీస్, జేసీటీ, ఇన్వెంచర్ గ్రో, పీఎంసీ ఫిన్ కార్ప్, ప్రిజమ్ఎక్స్ గ్లోబల్, రుచి ఇన్ఫ్రాస్టర్, తోయమ్ ఇండస్ట్రీస్, ఎవెగ్జియా లైఫ్ కేర్, జెన్ ఫార్మాసెక్, అల్కా ఇండియా, అంకిత్ మెట్ పవర్, ఇండోసోలార్, ఎస్బీసీ ఎక్స్‌పోర్ట్స్, ఎంసీ నాలీ భారత్, యుష్‌దేవ్ ఇంటెల్, వికాస్ ప్రాపంట్, జెనెక్స్ ల్యాబ్, బయోజీన్ ఫార్మా, పంజ్ లాయిడ్ వంటి పలు స్టాక్స్ ఉన్నాయి.

సుజ్లాన్ ఎనర్జీ గత ఏడాది కాలంగా 83 శాతం, ఆరు నెలల కాలంలో 44 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఏడాది క్రితం రూ.5 దిగువన ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు రూ.9.35 వద్ద ఉంది. ఏడాది క్రితం రూ.1000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు రూ.1800కి పైగా చేతికి వచ్చేవి. ఇలా ఎన్నో పెన్నీ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి. అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కాబట్టి స్టాక్ గురించి, ఆ రంగం గురించి, స్టాక్ చరిత్ర గురించి తెలుసుకొని, పూర్తి అవగాహనతో పెట్టుబడి పెట్టాలి. నిపుణుల సలహాలు అవసరం. పెన్నీ స్టాక్స్ అయితే పెట్టుబడి ప్రమాదం కనిపించదు. కానీ కంపెనీల చరిత్ర, ప్రాథమిక అంశాలు పరిశీలించాలి.


Click it and Unblock the Notifications