ఆర్బీఐ నిర్ణయాలు, కంపెనీల ఫలితాలు.. ఈవారం మార్కెట్ ఎలా ఉండవచ్చు?
వచ్చే వారం ఆర్బీఐ మానిటరీ పాలసీ(MPC నిర్ణయాలు, వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలు స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపనున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ అంశాలు కూడా ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతో సూచీలు పరుగులు పెట్టాయి. బడ్జెట్‌కు ముందు 57,000 స్థాయిలో ఉన్న సెన్సెక్స్ బడ్జెట్ ముందు, ఆ తర్వాత రెండు రోజులు అంతకంతకూ లాభాలు నమోదు చేయడంతో 59,000 పాయింట్ల మార్కును దాటింది. అయితే చివరి రెండు సెషన్‌లలో ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం చూపి స్వల్పంగా నష్టపోయింది. మొత్తానికి సూచీలు భారీగా లాభపడ్డాయి.

మార్కెట్ పైన ఈ ప్రభావం
వచ్చే వారం బడ్జెట్ అంశంతో పాటు అంతర్జాతీయ పరిణామాలు, త్రైమాసిక ఫలితాలు, ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు ప్రభావం చూపుతాయి. వచ్చే వారం భారతీ ఎయిర్టెల్, జిందాల్ స్టీల్, ఎసీసీ, హీరో మోటో కార్ప్, టాటా పవర్, హిండాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా ఫలితాలు వస్తున్నాయి. వీటితో పాటు రూపాయి కదలికలు, బ్రెంట్ క్రూడ్, ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(FIIs) ప్రభావం కూడా ఉండవచ్చు. ఇన్వెస్టర్లు వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటారని చెబుతున్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ సమీక్ష ఫిబ్రవరి 9న ఉంది. ఐఐపీ డేటా ఫిబ్రవరి 11వ తేదీన వస్తోంది.

తీవ్ర అస్థిరత
స్టాక్ మార్కెట్లు గత కొంతకాలంగా తీవ్ర అస్థిరతలో కనిపిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ ప్రభావం వీటిపై కనిపిస్తోంది. సమీప భవిష్యత్తులోను ఇది కొనసాగవచ్చు. దీనికి తోడు రాబోయే ఎంపీసీ సమీక్ష, కంపెనీల ఆదాయాలు ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టీవీఎస్ మోటార్స్ కంపెనీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఆర్సీటీసీ, ఎన్ఎండీసీ, సెయిల్ ఈ వారం తన త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది.

ముడి చమురు ధర ప్రభావం
పెరుగుతున్న ముడి చమురు మార్కెట్‌కు కీలకమైన ఆందోళన అయితే, భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా కీలకం. ఎఫ్ఐఐలు ఇప్పటికే అమ్మకాల మూడ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. గతవారంలో మొదటి వారం బుల్ రన్ కనిపించిందని, 30 షేర్ బీఎస్ఈ బెంచ్ మార్క్ 1444 పాయింట్లు లాభపడిందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications