ఫిక్స్‌డ్ డిపాజిట్ వర్సెస్ షేర్ మార్కెట్: అస్సలు ఊహించని నిజాలు బయటపెట్టిన బిగ్ ఇన్వెస్టర్!
గత కొన్నేళ్లుగా మన దేశంలో ఇన్వెస్ట్‌మెంట్ అనగానే అందరికీ ఒకటే ఫార్ములా కనిపిస్తోంది. లాంగ్ టర్మ్ కోసం ఈక్విటీల్లో ఉండండి, ప్రతినెల ఎస్ఐపీ (SIP) లు చేస్తూ పోండి.. మీ సంపద ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) కంటే చాలా రెట్లు ఎక్కువగా పెరుగుతుంది అని అందరూ చెబుతుంటారు. కానీ, తాజాగా ప్రముఖ మార్కెట్ దిగ్గజం శంకర్ శర్మ ఈ నమ్మకాన్ని పూర్తిగా సవాల్ చేశారు. ట్యాక్సులు, మార్కెట్ ఒడిదుడుకులు (Volatility) , అసలుకే ఎసరు వచ్చే రిస్క్‌ను లెక్కలోకి తీసుకుంటే.. సామాన్య ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ (stock market) ఎల్లప్పుడూ లాభదాయకం కాకపోవచ్చు అని ఆయన బాంబు పేల్చారు.
దేశంలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం భారత్‌లో మంత్లీ ఎస్ఐపీ పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరాయి. సామాన్యులు సైతం లాంగ్ టర్మ్ వెల్త్ కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు పరుగులు తీస్తున్నారు. కానీ, పన్నులు , రిస్క్ తర్వాత చేతికి వచ్చే అసలు రిటర్న్స్ ఎంత? అనే విషయాన్ని ఎవరూ గమనించడం లేదని శర్మ హెచ్చరించారు.

12 శాతం రిటర్న్స్ వర్సెస్ 7 శాతం ఎఫ్‌డీ
సాధారణంగా ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో వచ్చే 10% నుండి 12% రిటర్న్స్‌ను, ఎఫ్‌డీలలో వచ్చే 6% నుండి 8% వడ్డీతో నేరుగా పోలుస్తారు. కానీ ఈ పోలిక తప్పు అని శంకర్ శర్మ వాదిస్తున్నారు.
- మార్కెట్‌లో 12 శాతం రిటర్న్స్ వచ్చినా, దానిపై పడే ట్యాక్స్ (Tax) పోయాక ఎంత మిగులుతుంది?
- ఆ పైన మార్కెట్‌లో ఉండే 15% నుండి 20% వరకు ఉండే రిస్క్ , ఒడిదుడుకులను లెక్కేస్తే సీన్ మొత్తం మారిపోతుంది.
ఇక్కడే 'రిస్క్-అడ్జస్టెడ్ రిటర్న్' అనే పదం వస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో కచ్చితత్వం ఉంటుంది. ఎంత వడ్డీ వస్తుందో ముందే తెలుస్తుంది, మీ పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుంది. దీనినే ఆయన "రిటర్న్ ఆన్ క్యాపిటల్" (పెట్టుబడిపై లాభం) , "రిటర్న్ ఆఫ్ క్యాపిటల్" (పెట్టుబడి తిరిగి రావడం) మధ్య ఉన్న తేడాగా అభివర్ణించారు. ఎఫ్‌డీలో ఈ రెండూ గ్యారెంటీగా ఉంటాయి. కానీ, స్టాక్ మార్కెట్ (stock market) లో మీ పెట్టుబడి తిరిగి వస్తుందనే గ్యారెంటీ ఎవరూ ఇవ్వలేరు.
ఎస్ఐపీ (SIP) లతో లాభపడేది ఎవరు?
ప్రస్తుతం జనాలు ఎంతగానో నమ్ముతున్న ఎస్ఐపీల (Systematic Investment Plans) పై కూడా శర్మ ఘాటు విమర్శలు చేశారు. ఎస్ఐపీ అనేది ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అయినప్పటికీ, అది ఇన్వెస్టర్ల కంటే ఎక్కువగా కంపెనీ ప్రమోటర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు (VCs), ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ , విదేశీ ఇన్వెస్టర్లకు (FIIs) బాగా హెల్ప్ అవుతోందని అన్నారు.
మార్కెట్లోకి ఎస్ఐపీల ద్వారా నిరంతరం డబ్బు రావడం వల్ల మార్కెట్లో లిక్విడిటీ (నగదు లభ్యత) బాగుంటుంది. దీనిని వాడుకుని పెద్ద పెద్ద సంస్థలు, విదేశీ ఇన్వెస్టర్లు తమ షేర్లను సులభంగా అమ్ముకుని, లాభాలతో బయటపడటానికి (Exit) ఈజీ రూట్ దొరుకుతుందని ఆయన విశ్లేషించారు. అయితే ఫైనాన్షియల్ ప్లానర్లు మాత్రం, ఎస్ఐపీల వల్ల సామాన్యులలో క్రమశిక్షణ అలవడుతుందని, మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి లాభం పొందవచ్చని చెబుతుంటారు.
ఏది బెస్ట్ ఛాయిస్?
ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేదానికి ఒకటే సమాధానం లేదు. ఇది ఇన్వెస్టర్ వయసు, ఆదాయం, రిస్క్ తీసుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్‌లో భారీ సంపదను సృష్టించిన మాట వాస్తవమే అయినా, అందులో నష్టపోయే అవకాశాలు కూడా అంతే ఉంటాయి. అదే సమయంలో ఎఫ్‌డీలు స్థిరత్వాన్ని ఇస్తాయి కానీ ద్రవ్యోల్బణాన్ని (Inflation) పూర్తిగా దాటలేవు.
కేవలం పైకి కనిపించే రిటర్న్స్ నంబర్లు చూసి మోసపోకుండా, ఆ రిటర్న్స్ వెనుక ఉన్న రిస్క్‌ను కూడా అర్థం చేసుకోవడమే శంకర్ శర్మ కామెంట్స్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. అందుకే నిపుణులు ఎప్పుడూ ఒకే చోట కాకుండా.. సేఫ్టీ కోసం కొంత మొత్తాన్ని ఎఫ్‌డీల్లో, లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం కొంత మొత్తాన్ని స్టాక్ మార్కెట్ (stock market) లో బ్యాలెన్స్ చేస్తూ ఇన్వెస్ట్ చేయాలని సలహా ఇస్తుంటారు.


Click it and Unblock the Notifications