బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లు భారీ దిద్దుబాటుకు గురయ్యాయి. సెన్సెక్స్ ఇటీవల ఆల్ టైమ్ గరిష్టం 62,245కు వెయ్యి పాయింట్ల సమీపానికి వెళ్లి వెనక్కి వచ్చింది. జనవరి 17వ తేదీ తర్వాత మార్కెట్ అడపాదడపా స్వల్ప లాభాల్లో కనిపించినప్పటికీ, మొత్తానికి భారీగా నష్టపోయింది. గత పది పన్నెండు సెషన్‌లలో 4000 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పడిపోయింది. చమురు ధరల పెరుగుదల, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలకు తోడు బడ్జెట్‌కు ముందు మార్కెట్లు భారీ దిద్దుబాటుకు గురయ్యాయి.
రేపు (ఫిబ్రవరి 1, 2022) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సూచీలు నేడు కూడా అప్రమత్తంగా ఉండవచ్చు. సెన్సెక్స్ గతవారం 57,200 పాయింట్ల వద్ద ముగిసింది.

మార్కెట్లపై ఈ ప్రభావం
రేపు బడ్జెట్ నేపథ్యంలో సూచీలు అప్రమత్తంగా ఉండవచ్చు. అదే సమయంలో పీఎంఐ నెంబర్స్, వాహన విక్రయాలు, రష్యా-ఉక్రెయిన్ వంటి అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, అమెరికా ఎకనమిక్ డేటా, వివిధ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి.

మార్కెట్ ఈ వారం
నిఫ్టీ గతవారం 650 పాయింట్ల మేర నష్టపోయి, కనిష్టస్థాయిలో ముగిసింది. అమెరికన్ మార్కెట్లలో డౌన్ ట్రెండ్‌తో పాటు ఆర్థిక సంస్థల అమ్మకాలు మార్కెట్లో బలమైన దిద్దుబాటుకు గురయ్యాయి. బడ్జెట్ వరకు అప్రమత్తత కనిపిస్తోంది. ఆ తర్వాత బడ్జెట్‌ను అనుసరించి మార్కెట్ కదలికలు ఉంటాయి. ప్రస్తుత కనిష్టస్థాయిలో ఎంపిక చేసిన రంగాలు, ఎంపిక చేసిన స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణుల సూచన.
గతవారం నిఫ్టీ 17,102 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం 16,770 పాయింట్లకు దిగువకు వస్తే మరింత నష్టపోవచ్చునని అంచనా. నిఫ్టీ మద్దతు స్థాయి 16,920, 16,850. నిరోధకస్థాయి 17,270, 17,420.సెన్సెక్స్ గతవారం 57,200 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఈ వారం 56,500 దిగువకు వస్తే మరింత పడిపోయే అవకాశముందని, బడ్జెట్ నేపథ్యంలో అప్రమత్తంగా కదలాడవచ్చునని అంటున్నారు.

బంగారం, వెండి ధరలు
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.48,300కి కిందకు వస్తే మరింత పడిపోయే అవకాశముందని, రూ.47,000 స్థాయి కంటే కిందకు వస్తే రూ.46,500కు పడిపోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి మార్చి ఫ్యూచర్ రూ.63,240 కిందకు వస్తే రూ.60,000 స్థాయికి పడిపోవచ్చునని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1783 నుండి 1788 డాలర్ల మధ్య ట్రేడ్ కావొచ్చునని భావిస్తున్నారు. ఈ వారం బంగారం పాజిటివ్‌గా ఉండే అవకాశాలు 80 శాతం, నెగిటివ్‌గా ఉండే అవకాశాలు 20 శాతం ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications