కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. 2021 డిసెంబర్ 31వ తేదీతో ముగిసిన వారంలో బుల్ రన్ కనిపించింది. వ్యాల్యూ బయ్యింగ్, షార్ట్ కవరింగ్ బూస్ట్ వంటి అంశాలు బెంచ్ మార్క్ సూచీలు డిసెంబర్ 20వ తేదీ కనిష్టం నుండి 4శాతం మేర ఎగిసిపడేందుకు దోహదపడ్డాయి. భారీగా లాభపడిన రంగాల్లో ఫార్మా సెక్టార్ ఉంది. ఈ రంగం 5.4 శాతం ఎగిసిపడింది. ఆ తర్వాత ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ రంగాలు ఉన్నాయి. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 2.8 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 4.05 శాతం లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1130 పాయింట్లు ఎగిసి 58,254 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 350 పాయింట్లు లాభపడి 17,354 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

మార్కెట్ పుంజుకోవచ్చు
జీఎస్టీ కలెక్షన్లు డిసెంబర్ నెలలో మరోసారి రూ.1 లక్ష కోట్లు దాటాయి. గత నెలలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1.29 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. రూ.1 లక్ష కోట్లు దాటడం వరుసగా ఆరో నెల. మరోవైపు వాహనాల సేల్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ప్రభావం మార్కెట్ పైన కనిపించి, బుల్ రన్ కనిపించవచ్చునని అంటున్నారు. అయితే ఆటోకు సంబంధించి చిప్ కొరత ప్రభావం ఈ రంగంపై ఉంటుంది. ఇన్వెస్టర్లు పీఎంఐ డేటా, కరోనా కేసులను నిశితంగా పరిశీలిస్తున్నారు. మార్కెట్లు రెండు వారాలుగా స్వల్పంగా కోలుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అక్టోబర్ నెలలో పీఎంఐ 55.9 కాగా, నవంబర్ నెలలో 57.6గా నమోదయింది. నవంబర్‌తో వరుసగా ఐదో నెల వృద్ధిని నమోదు చేసింది. అయితే సేవా పీఎంఐ మాత్రం అక్టోబర్ నెలలో 58.4 కాగా, డిసెంబర్ నెలలో 58.1గా నమోదయింది. మిగతా రంగాలు వృద్ధిని నమోదు చేశాయి. FII, DIIల ప్రభావం మార్కెట్ పైన కనిపించనుంది.

సూచీలు ఇలా
నిఫ్టీ ఈ వారం 17400 పాయింట్ల నుండి 17500 పాయింట్ల మధ్య కదలాడవచ్చునని, సమీప భవిష్యత్తులో 17,640 పాయింట్లకు చేరుకుంటే, మరింత దూకుడు కొనసాగి, 17,200 దిశగా కనిపించవచ్చునని అంటున్నారు. ఇది 20 రోజుల చలన సగటుగా పేర్కొంటున్నారు.
సెన్సెక్స్ తక్షణ మద్దతుస్థయి 58,000, 57,430, 56,550. నిరోధకస్థాయి 58,750, 59,300, 59,780.

బంగారం ధరలు ఇలా
బంగారం ధరలు ఈ వారం దాదాపు స్థిరంగా కొనసాగే అవకాశాలు లేదా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఈ వారం రూ.47,460 వరకు దిగి రావొచ్చు. ఈ స్థాయి కంటే కిందకు వెళ్లకుంటే మాత్రం మళ్లీ పరుగు పెట్టే అవకాశాలు లేకపోలేదు. ధరలు పెరిగితే రూ.48,450 వద్ద నిరోధం, ఈ స్థాయిని కూడా దాటితే రూ.రూ.48,750 వరకు పెరగవచ్చునని అంచనా. రూ.47,400 సమీపంలో స్టాప్ లాస్‌తో కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు. వెండి మార్చి ఫ్యూచర్ రూ.62,970 కంటే పైకి వెళ్తే రూ.63,540 స్థాయికి పెరగవచ్చునని అంచనా. రూ.61,500 స్థాయికి వస్తే మాత్రం రూ.60,000 స్థాయికి పడిపోయే అవకాశాలున్నాయని అంచనా.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications