గతవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియగా, పసిడి ధరలు రూ.51,000 స్థాయిలో ముగిశాయి. అయితే మార్కెట్లు ఈ వారం లాభాల్లో కొనసాగవచ్చునని, ప్రధానంగా భారీ పతనం నేపథ్యంలో కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతు లభించవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే భారీ లాభాలు మాత్రం ఉండకపోవచ్చునని అంటున్నారు. ద్రవ్యోల్భణం కట్టడికి వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడంతో గతవారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్లు దూకుడుగా అమ్మకాలు కొనసాగించడం ప్రభావం చూపింది. డాలర్ మారకంతో రూపాయి క్షీణించడం కూడా ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్ 5.4 శాతం, నిఫ్టీ 5.6 శాతం నష్టపోయింది.
అమెరికా ఫెడ్ రిజర్వ్ బుధవారం నాటి ప్రసంగం మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. మార్కెట్లు సానుకూలంగా కదలాడితే నిఫ్టీ 15400 వద్ద తక్షణ నిరోధకం ఎదురు కావొచ్చునని, 14800 నుండి 15000 మధ్య మద్దతు లభించవచ్చునని భావిస్తున్నారు. 5జీ స్పెక్ట్రం నేపథ్యంలో టెలికం కంపెనీ షేర్లపై ప్రభావం ఉంటుందని, వాహన కంపెనీల షేర్లు సానుకూలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. సెన్సెక్స్ తక్షణ మద్దతు 50,800, 49,500 వద్ద కనిపిస్తోందని, నిరోధకం 52,000, 53,300 స్థాయిలో కనిపిస్తోందని అంటున్నారు.

బంగారం ధరలు ఈ వారం ప్రతికూల ధోరణితో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.50,500 టార్గెట్‌తో 51,400కు దిగువన షార్ట్ సేల్ చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. 51,600 వద్ద స్టాప్ లాస్ పెట్టుకోవాలంటున్నారు. వెండి ఫ్యూచర్ రూ.60,000కు దిగువనే కనిపిస్తోందని, ఆ తర్వాత రూ.58,000 స్థాయికి కూడా చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications