అమెరికా ఫెడ్, భారత కేంద్ర బ్యాంకు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపునకు తోడు ద్రవ్యోల్భణ ఆందోళనలు, చైనా లాక్ డౌన్ ఆంక్షలు స్టాక్ మార్కెట్ల పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ సూచీలు గతవారం కుప్పకూలాయి. వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో పసిడి ధరలు కూడా తగ్గుతున్నాయి. క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే దారుణంగా పతనమైంది. గతవారం స్టాక్, బంగారం, క్రిప్టో మార్కెట్లు క్షీణించాయి. దీంతో ఈ వారం ఎలా ఉంటుందనే అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అందుకే గతవారం నష్టాల్లో
ద్రవ్యోల్భణ భయాలు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీ రేటు పెంపు వంటి అంశాల కారణంగా గతవారం మార్కెట్లు నష్టపోయాయి. చమురు ధరల పెరుగుదల, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, ప్రపంచ మార్కెట్ బలహీనతలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కూడా ప్రభావం చూపాయి.
మొత్తానికి వడ్డీ రేట్లు పెరిగి, అంతర్జాతీయంగా వృద్ధి మందగించవచ్చుననే అంచనాలతో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం ఎనిమిది ఏళ్ల గరిష్టం 7.79 శాతానికి చేరుకోగా, మార్చిలో పారిశ్రామికోత్పత్తి స్వల్పంగా 1.9 శాతానికి పెరిగింది.

మార్కెట్ ఎలా ఉండవచ్చు
సెన్సెక్స్ గతవారం 52,800 పాయింట్ల దిగువన, నిఫ్టీ 15,800 పాయింట్ల దిగువన ముగిశాయి. సూచీలు ఈ వారం 52,000 దిగువకు పడిపోతే మరింత నష్టపోవచ్చునని, పైకి చేరుకుంటే 54,500 వద్ద నిరోధకం ఎదురు కావొచ్చునని భావిస్తున్నారు. ఈ స్థాయి కంటే పైకి చేరుకుంటే రికవరీ ఉండవచ్చునని చెబుతున్నారు.సెన్సెక్స్ మద్దతు 52,000, 51,600. నిరోధకం 53,400, 54,600.

బంగారం ధరలు
జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ఈవారం రూ.49,250 వద్ద మద్దతు కనిపిస్తోందని, ఈ స్థాయిని కోల్పోతే రూ.48,600 వరకు పడిపోవచ్చునని, ఒకవేళ మరింత పైకి చేరుకుంటే రూ.50,975 సమీపంలో నిరోధకం ఎదురు కావొచ్చునని భావిస్తున్నారు. ఈ స్థాయి దాటితే రూ.52,000 క్రాస్ చేయవచ్చునని అంటున్నారు. రూ.50,980 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా ఈ వారం కూడా దిద్దుబాటుకు గురి కావొచ్చునని అంటున్నారు.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications