యూఎస్ ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ ఎంపీసీ సమావేశ నిర్ణయాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కార్పోరేట్ దిగ్గజాల ఫలితాల పైన దృష్టి సారిస్తున్నారు. ఈ వారంలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, బ్యాంకింగ్ దిగ్గజం HDFC ఫలితాలు ఉన్నాయి. నేడు టీసీఎస్, బుధవారం ఇన్ఫోసిస్, 16న హెచ్‌డీఎఫ్‌సీ ఫలితాలు వస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి క్రూడాయిల్ అధిక ధరల వల్ల కంపెనీల మార్జిన్ల పైన ఆందోళనలు తలెత్తుతున్నాయి. అందుకే కార్పోరేట్ సంస్థల భవిష్యత్తు అంచనాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు.

మార్కెట్‌పై వీటి ప్రభావం
అమెరికా ఫెడ్ రిజర్వ్ స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచగా, ఆర్బీఐ ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగించింది. ఇవి మార్కెట్లకు ఊతమిచ్చే అంశాలు. మంగళవారం పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. వీటిని కూడా ఇన్వెస్టర్లు పరిగణలోకి తీసుకుంటారు. శుక్రవారం ఆర్బీఐ వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నట్లు ప్రకటించడంతో వారాంతంలో మార్కెట్లు కాస్త సానుకూలంగా ముగిశాయి. ఈ వారం కూడా సానుకూలంగానే కనిపిస్తోంది. అయితే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల ఫలితాల ప్రభావం మాత్రం ఉంటుంది. కరోనా తర్వాత ఐటీ రంగం సానుకూలంగానే ఉంది. కాబట్టి ఫలితాలు సానుకూలంగానే ఉండవచ్చునని భావిస్తున్నారు.

మద్దతు.. నిరోధకం
సెన్సెక్స్ గతవారం 59,500కు సమీపంలో, నిఫ్టీ 17,785 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం 60,000 మార్కు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 58,500 వద్ద మద్దతు కనిపిస్తుండగా, 60,850 పాయింట్ల వద్ద నిరోధకం కనిపిస్తోంది. ఈ స్థాయిని దాటితే 61,500 సమీపానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. నిఫ్టీకి ఈ వారం 18,000 వద్ద నిరోధకం, 17,600 వద్ద మద్దతు కనిపిస్తోంది.
ఈ వారం మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, అంబేడ్కర్ జయంతి కారణంగా గురు, శుక్రవారాలు మార్కెట్‌కు సెలవు. ఈ వారం మూడు రోజులు మాత్రమే ట్రేడింగ్ ఉండనుంది.

బంగారం ధరలు
బంగారం ధరలు ఈ వారం దాదాపు స్థిరంగా కొనసాగవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. గోల్డ్ జూన్ ఫ్యూచర్ రూ.51,300 వద్ద మద్దతు లభిస్తోందని, ఆ స్థాయిని కోల్పోతే 50,700 స్థాయికి పడిపోవచ్చునని భావిస్తున్నారు. ముందుకు సాగితే మాత్రం 52,400 వద్ద నిరోధకం కనిపిస్తోందని అంటున్నారు. ఈ స్థాయిని దాటితే రూ.53,000 దిశగా పరుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications