Stepup SIP: రిటైర్మెంట్ కోసం బెస్ట్ ప్లాన్ స్టెప్ అప్ SIP.. ఇలా చేస్తే భారీ కార్పస్.. వివరాలు
Mutual Funds: మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఇప్పటి యూత్ రిటైర్మెంట్ తర్వాత జీవితం గురించి ముందునుంచే మంచి ప్రణాళికతో ఉంటున్నారు. ఇందులో భాగంగా EPF, PPF, NPS వంటి పలు ఆకర్షణీయ పథకాల్లో చిన్న వయసు నుంచే పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. అయితే మార్కెట్లపై కొంత అవగాహన ఉన్నవారికి మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ఖచ్చితంగా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
రిటైర్మెంట్ కోసం బ్యాలెన్స్ డ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ అయిన సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. పోర్ట్‌ఫోలియోను ఈక్విటీ, డెట్, గోల్డ్ వంటి వివిధ వర్గాలుగా విభజించి మంచి డైవర్సిఫై చేయడం తప్పనిసరి. అప్పుడే మార్కెట్లలో జరిగే అకస్మాత్తు పరిణామాలను తట్టుకుని కార్పస్ బిల్డ్ చేయడం కుదురుతుంది.

ఆయా వ్యక్తుల ఆదాయం ప్రకారం SIP మోడ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రారంభంలో తక్కువతో మొదలుపెట్టవచ్చు. అయితే క్రమేపీ దాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పుడు తక్కువ మొత్తంతో బిల్డ్ చేస్తున్న కార్పస్ పదవీ విరమణ అనంతరం ఖర్చులకు ఏమాత్రం సరిపోదు. అందుకే స్టెప్-అప్ SIP విధానాన్ని అనుసరించడం ఈ సమస్యకు పరిష్కారంగా చెబుతున్నారు.
30 ఏళ్లు వయస్సున్న ఓ వ్యక్తి ప్రతినెలా 5 వేలు SIP చేస్తున్నారు అనుకుంటే 60 ఏళ్ల సమయానికి అతని పెట్టుబడి కేవలం 18 లక్షలు. సగటున ఏడాదికి 12 శాతం రాబడిగా లెక్కిస్తే మొత్తం కార్పస్ 1.54 కోట్లు అవుతుంది. కానీ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోనికి తీసుకుంటే అప్పటికే ఇది ఏమంత పెద్దమొత్తం కాదు అని గమనించాలి.
స్టెప్-అప్ SIP పద్ధతిలో నెలనెలా పెట్టుబడిగా పెడుతున్న 5 వేలకు ప్రతి ఏడాది 10 శాతాన్ని అదనంగా జోడించాలి. అంటే మొదటి ఏడాది 5 వేలు SIP చేస్తే తర్వాతి సంవత్సరం 5 వేల 500, అనంతరం 6 వేలు అలా పెంచుకుంటూ పోవాలి. అప్పుడు 60 ఏళ్ల నాటికి ఈ మొత్తం 44.10 లక్షలు జమ అవుతుంది. అదే 12 శాతం రాబడిని పరిగణలోనికి తీసుకుంటే కార్పస్ మొత్తం ఏకంగా 2.66 కోట్లు అవుతుంది. తద్వారా ఆర్థిక ఇబ్బందుల ప్రస్తావన లేకుండా రిటైర్‌మెంట్ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.


Click it and Unblock the Notifications