బిట్‌కాయిన్‌కు దూరం జరగండి: ఇన్వెస్టర్లకు ఆ సీఈవో సూచన
గత కొద్ది కాలంగా బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఏడాది కాలంలో బిట్ కాయిన్ 500 శాతం వరకు వృద్ధి సాధించింది. ఓ సమయంలో 65వేల డాలర్లకు చేరుకొని, 700 శాతానికి పైగా పెరిగింది. అయితే ఇటీవల దాదాపు సగం క్షీణించింది. వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ ఏథేరియం కూడా 3000 డాలర్లను దాటి ప్రస్తుతం 2200 డాలర్లకు పైన ఉంది.
క్రిప్టోలో రెండేళ్లకు ముందు పెట్టుబడులు పెట్టిన వారు ఇప్పుడు అనూహ్యంగా భారీ రిటర్న్స్ పొందారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో క్రిప్టోలో పెట్టుబడులు సరికాదని పలువురు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా జేపీ మోర్గాన్ సీఈవో జామీ డైమన్ కూడా బిట్ కాయిన్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

బిట్ కాయిన్‌కు దూరం జరగాలి...
ఓ వైపు క్రిప్టోకరెన్సీ పాత, కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. మరోవైపు బిట్ కాయిన్‌లో పెట్టుబడులు వద్దని, దీనికి దూరంగా ఉండాలని జేపీ మోర్గాన్ సీఈవో జామీ డైమన్ అన్నారు. ఆయన ఓ కార్యక్రంలో మాట్లాడారు. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ పట్ల ఆయన పెదవి విరిచారు. అది ఆస్తి కాదని అభిప్రాయపడ్డారు. తనకు తెలిసినంత వరకు దీనికి వ్యాల్యూ లేదని, ప్రజలు ఇందులో పెట్టుబడులు పెట్టడానికి దూరం జరగాలని సూచించారు.

ఇది నా అభిప్రాయం మాత్రమే
అయితే ఇది తన అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. ఎవరి ఇష్టం వారని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు తాను మరిజునాను తీసుకోనని, కానీ ప్రభుత్వం దీనిని చట్టబద్దం చేస్తే తనకు ఇష్టం లేదని దానిని ఆపలేనని, అలాగే ప్రజలు దీనిని అట్టిపెట్టుకోవడాన్ని కూడా నిలువరించలేనని చెప్పారు. కాబట్టి బిట్ కాయిన్ పైన తన అభిప్రాయం తనకు ఉందన్నారు. బిట్ కాయిన్ పైన చర్చ సాగుతున్నట్లు తెలిపారు. క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్స్ అవసరమని అభిప్రాయపడ్డారు.

40 శాతం క్షీణత
గోల్డ్‌మన్ శాక్స్ డేవిడ్ సోలోమన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్రియాన్ మోయ్‌నిహన్, సిటీ గ్రూప్ జేన్ ఫ్రేజర్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉండగా, చైనా నిర్ణయం, ఎలాన్ మస్క్ ఎన్విరాన్‌మెంట్ ట్వీట్ వంటి వివిధ కారణాలతో బిట్ కాయిన్ గతవారం పడిపోయింది. ఈ నెలలో దాదాపు 40 శాతం క్షీణించింది.


Click it and Unblock the Notifications