ప్రభుత్వరంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నిధుల ఆధారిత రుణ రేటు(MCLR)ను అన్ని కాలపరిమితులపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుతం ఏడాది ఎంసీఎల్ఆర్ 7.25 శాతంగా ఉంది. తాజా తగ్గింపుతో ఇది 7 శాతానికి చేరుకుంటుంది. ఎస్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం ఇది వరుసగా 13వసారి. ఎక్స్టర్నల్ బెంచ్ రేటు ఆధారిత రుణాలపై 75 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.40 శాతంగా (ఇదివరకు 8.15 శాతం) నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో బ్యాంకులు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తోన్న విషయం తెలిసిందే.

జూన్ 10వ తేదీ నుండి అమల్లోకి
ఎస్బీఐ తగ్గించిన వడ్డీ రేట్లు జూన్ 10వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. ఆర్బీఐ ఇటీవల రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలీ చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఎంసీఎల్ఆర్‌ని పావు శాతం, రెపో ఆధారిత రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత రుణాలపై ఆర్బీఐ కల్పించిన పూర్తి ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలీ చేసింది. మార్చి నుండి సెంట్రల్ బ్యాంకు 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

హోమ్ లోన్ ఈఎంఐ ఎంత తగ్గుతుంది
ఏడాది కాలపరిమితి కలిగిన ఎక్స్టర్నల్ బెంచ్ రేటు (EBR) 7.05 శాతం నుండి 6.65 శాతానికి దిగి వస్తుంది. ఆర్ఎల్ఎల్ఆర్ 6.65 శాతం నుండి 6.25 శాతానికి దిగి వచ్చింది. తాజా నిర్ణయంతో ఎంసీఎల్ఆర్‌తో అనుసంధానమైన ముప్పై ఏళ్ల కాలపరిమితి కలిగిన రూ.25 లక్షల హోమ్ లోన్ పైన రూ.421 ఈఎంఐ తగ్గనుంది. అలాగే ఈబీఆర్/ఆర్ఎల్ఎల్ఆర్ కూడా రూ.660 తగ్గుతుంది.

ఫిక్స్డ్ డిపాజిట్లపై మే నెలలో వరుసగా రెండోసారి తగ్గింపు
ఎస్బీఐ మే 27వ తేదీన ఫిక్స్డ్ డిపాజిట్స్ వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. మే నెలలో డిపాజిట్లపై వడ్డీ తగ్గించడం అది రెండోసారి. అంతకుముందు మే 12వ తేదీన తగ్గించింది. రూ.2 కోట్లకు తక్కువ కలిగిన రిటైల్ డిపాజిటర్లకు వడ్డీ రేటును 5.5 శాతం నుండి 5.1 శాతానికి తగ్గించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications