SBI: అదిరిపోయే పథకం తీసుకొచ్చిన ఎస్బీఐ లైఫ్.. ఐదేళ్లు రూ.50 వేల చొప్పున కడితే రూ.45 లక్షలు మీ సొంతం..!
ఒకప్పుడు చదువు పెద్ద ఖర్చు పెట్టేవారు కాదు. ప్రభుత్వ పాఠశాలలకు పంపించే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. నర్సరీ నుంచి ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇక పై చదువులు మరి దారుణంగా మారాయి. పై చదువుల కోసం కోట్లలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పిల్లలకు బంగారు భవిష్యత్ అందించేందుకు ఎస్బీఐ లైఫ్ ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం పిల్లల ఉన్నత చదువులు, వివాహం ఉపయోగపడేలా రూపొందించారు. భవిష్యత్తు నిధిని ఏర్పాటు చేసేందుకు 'ఎస్బీఐ లైఫ్-స్మార్ట్ స్కాలర్ ప్లస్' పథకాన్ని తీసుకొచ్చింది.
పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించడంతో పాటు మార్కెట్-లింక్డ్ రాబడుల ద్వారా వారి కోసం పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చడానికి ఎస్బీఐ లైఫ్-స్మార్ట్ స్కాలర్ ప్లస్ తీసుకొచ్చారు. ఈ పథకంలో ప్రీమియం పేయర్ వేవర్ బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒకే సమయంలో ఇన్సూరెన్స్ కవరేజ్, మార్కెట్ ఆధారిత పెట్టుబడి రాబడులను అందిస్తుందని చెబుతున్నారు. పాలసీ కాలవ్యవధిలో ప్రీమియం చెల్లించే తల్లిదండ్రులు దురదృష్టవశాత్తు మరణించినా లేదా వైకల్యం పొందినా, కుటుంబానికి వెంటనే ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తించనుంది. మిగిలిన భవిష్యత్ ప్రీమియంలను ఎస్బీఐ లైఫ్ సంస్థే పే చేస్తోంది.

పాలసీ ముగిశాక నిర్ణీత ఫండ్ పిల్లలకు అందనుంది. ఈ పథకం ముఖ్యమైన సౌలభ్యం ఏంటంటే.. తల్లిదండ్రులు సుదీర్ఘ కాలం పాటు కాకుండా కేవలం ఐదేళ్ల పాటు మాత్రమే ప్రీమియం చెల్లించే ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఐదేళ్ల పాటు నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన అనంతరం ఆ పెట్టుబడిని 15 నుంచి 20 ఏళ్ల సుదీర్ఘ పాలసీ కాలవ్యవధి ముగిసే వరకు ఫండ్లలో కొనసాగనివ్వవచ్చని బ్యాంకు పేర్కొంటోంది.
ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్ ప్లస్ ఓ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాబట్టి ఇందులో మీరు చెల్లించే సొమ్ము ఈక్విటీ, డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టబడతారు. దీర్ఘకాలంలోమార్కెట్ సాధించే వార్షిక వృద్ధి ఆధారంగా ఫండ్ విలువ పెరుగుతుంది.
ప్రతి ఏటా దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఐదేళ్ల పాటు జమ చేసి.. 12-15 శాతం వార్షిక మార్కెట్ రాబడి లభిస్తే.. మెచ్యూరిటీ సమయానికి రూ.45 లక్షల వరకు భారీ ఫండ్ ఏర్పడే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. ఈ పాలసీలో తల్లిదండ్రుల రిస్క్ పరిమితికి అనుగుణంగా పెట్టుబడి పెట్టడానికి 10 రకాల ఫండ్ ఎంపికలు అందుబాటులో తీసుకొచ్చారు. ప్రీమియం చెల్లింపుల కోసం సింగిల్ పే, లిమిటెడ్ పే లేదా రెగ్యులర్ పే వంటి విభిన్నఆప్షన్లు ఎంచుకోవచ్చు. అలాగే క్రమం తప్పకుండా లాయల్టీ అడిషన్స్ అందించడం ద్వారా ఫండ్ విలువ కాలక్రమేణా మరింత పెరుగనుంది. పాలసీ ప్రారంభమైన ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ పూర్తయిన అనంతరం అత్యవసర ఆర్థిక అవసరాల కోసం పాక్షికంగా విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. అయితే ఇందులో రిస్క్ ఉంటుందని గమనించాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications