Electoral Bonds: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియాలో ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్టోరల్ బాండ్స్ విషయం ఉత్యున్నత ధర్మాసనం ఎదుట నిలిచింది.
తాజాగా ఎలక్టోరల్ బాండ్స్ కేసు విచారణలో వివరాలను అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 30 వరకు గడువు పొడిగించాలని సమయం కోరగా సుప్రీం కోర్టు అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 12న ప్రచురించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో చేసేది లేక స్టేట్ బ్యాంక్ అన్ని పత్రాలను సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి అందించింది.

ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ 'రాజ్యాంగ విరుద్ధం' అని పేర్కొంటూ భారత సర్వోన్నత న్యాయస్థానంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. వివాదాస్పద రాజకీయ నిధుల పథకాన్ని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు కొట్టివేయడం గమనార్హం.
బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ విధానం స్పష్టంగా లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. దేశంలో ఎలక్టోరల్ బాండ్స్ జారీకి అర్హత కలిగిన ఏకైక ఆర్థిక సంస్థ స్టేట్ బ్యాంక్ కావటంతో.. ఏప్రిల్ 12, 2019 నుంచి ఫిబ్రవరి 15, 2024 మధ్య జారీ అయిన పత్రాల వివరాలు ప్రస్తుతం సుప్రీం ధర్మాసనం ఆదేశాలతో త్వరలోనే ప్రజల ముందుకు బహిరంగంగా తీసుకురానున్నారు.
తాజాగా పొందిన సమాచారంతో భారత ఎన్నికల సంఘం రెండు వేర్వేరు జాబితాలను జారీ చేస్తుంది. ఒకటి బాండ్ల కొనుగోలు తేదీ, కొనుగోలుదారు పేరు, ప్రతి బాండ్ విలువను కలిగి ఉంటుంది. మరో జాబితాలో రాజకీయ పార్టీలు క్యాష్ చేసిన ప్రతి బాండ్ వివరాలు, క్యాష్ చేసిన తేదీ, ఇతర బాండ్ విలువ ఉంటాయి.
అయితే ఎస్‌బీఐ ఎన్నికల సంఘం వెల్లడించని విషయం ఒకటి ఉంది. ప్రతి ఎలక్టోరల్ బాండ్ పేపర్‌పై ప్రత్యేకమైన ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ముద్రించబడి ఉంటుంది. నిర్దిష్ట లైటింగ్ పరిస్థితుల్లో మాత్రమే కనిపించేలా రూపొందించబడింది. దీనికి సంబందించిన వివరాలు బయటకు రావని తెలుస్తోంది. కానీ ఇది చాలా ముఖ్యమైన అంశమని అంటున్నారు.


Click it and Unblock the Notifications