చేతిలో రూ. 11 వేల కోట్లు ఆస్తి.. హోమ్ లోన్ ఇవ్వని బ్యాంక్.. జీవితాంతం ఆఫీసులోనే బతకాలా అంటున్న రైజ్ సీఈఓ..

మంచి క్రెడిట్ హిస్టరీతో పాటుగా.. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న బ్యాంకింగ్ సంబంధాలు ఉన్న ఎవరికైనా గృహ రుణం చాలా ఈజీగా లభిస్తుందని మనమంతా భావిస్తాం. అయితే రైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన ప్రవీణ్ జాదవ్‌కు ఎదురైన అనుభవం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అతనికి హోమ్ లోన్ రిజెక్ట్ అయింది. నా సొంతింటి కల ఇక నెరవేరదా అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు తన గృహ రుణ దరఖాస్తును కేవలం తాను ఒక వ్యవస్థాపకుడిని అయినందుకే తిరస్కరించిందని బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన పంచుకున్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఫిన్‌టెక్ ఆవిష్కర్తలలో ఒకరిగా తనను గౌరవించిన అదే బ్యాంకు.. రుణం ఇచ్చే విషయంలో మాత్రం వెనకడుగు వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తమ కంపెనీలో పనిచేసే సాధారణ ఉద్యోగులకు సులభంగా రుణాలు ఇచ్చే ఆ బ్యాంకు.. వ్యవస్థాపకులను మాత్రం హై రిస్క్ కేటగిరీ కింద పరిగణించి.. లోన్ తిరస్కరించిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ లెక్కన జీవితాంతం ఆఫీసులోనే గడపాల్సి వస్తుందేమోనంటూ చమత్కరించారు.

Fintech CEO Home Loan Rejected Startup Founder Bank Loan Mortgage Rejection Fintech News Home Loan Approval Credit Score Banking News Startup News Business News Viral News CEO

ప్రవీణ్ జాదవ్ సాధారణ కస్టమర్ ఏమీ కాదు. దాదాపు 25 సంవత్సరాలకు పైగా ఆ బ్యాంక్‌తో లావాదేవీలు జరుపుతున్నారు. ఆస్తుల పరంగా ఆ బ్యాంకులోని టాప్ 0.1 శాతం అగ్రశ్రేణి కస్టమర్లలో ఒకరు. ఆ బ్యాంకుతో ఆయనకున్న లావాదేవీల సంబంధం రుణ విలువ కంటే 5 నుండి 6 రెట్లు ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఆయన సిబిల్ స్కోరు కూడా అత్యుత్తమ రుణ అర్హతను సూచించేలా 800 కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ప్రవీణ్ జాదవ్ నేతృత్వంలోని రైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ.. ప్రముఖ స్టాక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ధన్ కు మాతృ సంస్థగా ఉంది. అక్టోబర్ 2025లో ఈ ముంబై స్టార్టప్ సుమారు 120 మిలియన్ డాలర్ల సిరీస్ బి ఫండింగ్ సాధించి.. 1.2 బిలియన్ డాలర్ల విలువతో భారతదేశపు ప్రతిష్టాత్మక యూనికార్న్ క్లబ్‌లో కూడా చేరింది.

Also Read

ప్రవీణ్ జాదవ్ పెట్టిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. చాలా మంది నెటిజన్లు తమ సొంత అనుభవాలను, భిన్నమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కేవలం ఉద్యోగం చేసే వారి చుట్టూనే నిర్మితమైందని.. వ్యవస్థాపకులకు ఇందులో సరైన గుర్తింపు ఉండదని కొందరు అభిప్రాయపడ్డారు.

కాగా ఒక నెటిజన్ చమత్కారంగా స్పందిస్తూ.. బ్యాంకుల దృష్టిలో వ్యవస్థాపకులు హై రిస్క్ కేటగిరీలోకి రావడానికి అసలు కారణం వేరే ఉందని విశ్లేషించారు. వ్యవస్థాపకులకు ఏదైనా పెద్ద ఆర్థిక ప్రయోజనం చేకూరితే.. వారు 30 ఏళ్ల గృహ రుణాన్ని కేవలం 3 ఏళ్లలోనే తీర్చేస్తారని.. దీనివల్ల బ్యాంకులు తమ 27 ఏళ్ల వడ్డీ ఆదాయాన్ని కోల్పోతాయని, అందుకే బ్యాంకులు వీరికి రుణాలు ఇవ్వడానికి భయపడతాయంటూ ఆయన భిన్నమైన కోణాన్ని ఆవిష్కరించారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+