వెయ్యితో పెట్టుబడి స్టార్ట్.. 3 నెలల్లో రూ.31,000 వడ్డీ చేతికి, పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ ఇదిగో..!
Postal Scheme: ఇండియాలో ఎన్ని స్కీమ్స్ లేదా పెట్టుబడి సాధనాలు వచ్చినప్పటికీ ప్రజాధరణ కోల్పోని ఏకైక సంస్థగా పోస్టాఫీసులు నిలిచాయి. వీటిని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నందున ఎలాంటి అక్రమాలు, భయాలు లేకుండా ప్రజలు తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. పైగా వివిధ కేటగిరీలు, వయస్సుల ప్రజలకు అవసరమైన వివిధ స్కీమ్స్ రూపొందించటంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ ముందే ఉంది.
ఆర్థిక వ్యవస్థలో చీకట్లు, స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదొడుకులు కొనసాగుతున్న సమయంలో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న పెట్టుబడి సాధనాల్లో ప్రభుత్వ హామీ కలిగిన స్కీమ్స్ ముందువరుసలో ఉంటాయని మనందరికీ తెలిసిందే. ఈక్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తున్న సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(SCSS) గ్యారెంటీ ఆదాయానికి హామీ అందిస్తోంది. పదవీ విరమణ తర్వాత చేతిలో పెద్ద మెుత్తంలో డబ్బును కలిగి ఉండే సీనియర్ సిటిజన్లకు ఇదొక గొప్ప స్కీమ్ అని తప్పక తెలుసుకోవాల్సిందే. ఇది ప్రతి నెల లేదా త్రైమాసికానికి ఒకసారి ఆదాయాన్ని పెట్టుబడిదారుల చేతికి అందిస్తుంది.

ఒక్కసారి పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ వరకు స్థిరంగా పెట్టుబడిదారులకు స్కీమ్ ఆదాయాన్ని అందిస్తూనే ఉంటుంది. మెచ్యూరిటీపై పూర్తి మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది. వాస్తవానికి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది ప్రభుత్వ-ఆధారిత పదవీ విరమణ ప్రయోజన పథకం. సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చు. పైగా పెట్టుబడిపై పన్ను ప్రయోజనం కూడా అందించబడుతోంది. దీనిలో పెట్టుబడి పెట్టేందుకు అవసరమైన వివరాలను తెలుసుకోవటానికి మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసును సంప్రదించవచ్చు. ఆదాయంతో పాటు భద్రతపై ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా రాబడిని పొందుతూ ఉంటారు.
స్కీమ్ అత్యధికంగా ఉన్వెస్టర్లకు 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇదే స్థాయిలో వడ్డీని అందిస్తున్న మరో పథకం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ మాత్రమే కావటం గమనార్హం. ఖాతాను ఒంటరిగా లేదా జీవిత భాగస్వామితో ఉమ్మడిగా తెరిచేందుకు రెండు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 5 ఏళ్ల కాలవ్యవధి ఉండే ఈ స్కీమ్ కింద పెట్టుబడిదారులు కనీసం రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. మెచ్యూరిటీ కంటే మునుపే ఖాతాను క్లోజ్ చేసుకునేందుకు అవకాశం కూడా అందించబడుతోంది. పైగా సెక్షన్ 80 సీ కింద ఇన్వెస్టర్లు రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను ప్రయోజనాన్ని కూడా అందుకుంటారు.
ఎవరైనా వ్యక్తి పదవీ విరమణ సమయంలో అందుకున్న కార్పస్ రూ.30 లక్షలు ఇందులో పెట్టుబడిగా పెట్టినట్లయితే ప్రకటించబడిన 8.2 శాతం వడ్డీ రేటు కింద మూడు నెలలకు ఒకసారి రూ.30,750 వడ్డీ ఆదాయాన్ని పొందుతూనే ఉంటారు. అంటే ఏడాది రూ.1.23 లక్షలు కాగా, 5 ఏళ్లలో కేవలం వడ్డీ రూపంలోనే రూ.6.15 లక్షల రాబడి అందించబడుతుంది. ఖాతాను స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు లేదా 55-60 సంవత్సరాల వయస్సు గల రిటైర్డ్ ఉద్యోగులు ఖాతాను తెరవవచ్చు. కనీసం 60 ఏళ్ల వయస్సు ఉన్న రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బంది ఖాతాలను తెరవవచ్చు. అయితే స్కీమ్ కింద హిందు అన్డివైడెడ్ ఫ్యామిలీలు, ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టేందుకు అర్హులు కారని గమనించాలి.


Click it and Unblock the Notifications