సురక్షిత పెట్టుబడుల కోసం బ్యాంకు డిపాజిట్(FD), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(PPF), సుకన్య సమృద్ధి యోజన(SSY)తో పాటు ఇతర స్మాల్ సేవింగ్ స్కీమ్స్ గ్యారెంటీ రిటర్న్స్‌ను అందిస్తాయి. అయితే ఈ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం పైన మీరు ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపుకు అన్ని అర్హత పొందలేవు. ఈ నేపథ్యంలో పెట్టుబడులు, పన్ను మినహాయింపులకు సంబంధించి కొన్ని అంశాలు...

EEE అంటే ఏమిటి?
EEE అంటే ఎక్సెంప్షన్, ఎక్సెంప్షన్, ఎక్సెంప్షన్. ఇక్కడ మొదటి 'మినహాయింపు' అంటే మీ పెట్టుబడికి డిడక్షన్ వర్తిస్తుంది. కాబట్టి పెట్టుబడి పెట్టిన మొత్తానికి సమానమైన వేతనంలో కొంత భాగాన్ని మీరు చెల్లించవలసిన అవసరం లేదు.
అలాగే రెండో 'మినహాయింపు' అంటే అక్యుములేషన్ ఫేజ్‌కు రిటర్న్స్ పైన పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. మూడవ లేదా చివరి 'మినహాయింపు' ఉపసంహరణ సమయంలో పెట్టుబడి నుండి మీ ఆదాయం మీ చేతుల్లో పన్నురహితంగా ఉంటుంది.EEE సాధారణంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ వంటి వాటికి వర్తిస్తుంది.

బ్యాంకు FDపై వడ్డీ రేటు
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ పైన వచ్చే వడ్డీ పైన ట్యాక్స్ ఉంటుంది. FD పెట్టుబడి ద్వారా వచ్చే ఇంటరెస్ట్ పైన బ్యాంకులు 10 శాతం టీడీఎస్ ఛార్జ్ చేస్తుంది.

PPF వడ్డీ రేటు
సెక్షన్ 80సీ కింద PPFకు ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. పెట్టుబడిపై మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత వచ్చే వడ్డీ మొత్తంపై ఎలాంటి ఛార్జ్ ఉండదు.

సుకన్య సమృద్ధి యోజన
పీపీఎఫ్ వలె సుకన్య సమృద్ధి యోజన (SSY) కూడా ప్రభుత్వ ప్రత్యేక పెట్టుబడి పథకం. ఇది ఆడపిల్లల కోసం ఉద్దేశించిన పథకం. దీనికి EEE వర్తిస్తుంది. సెక్షన్ 80సీ కింద SSY పన్ను మినహాయింపు కిందకు వస్తుంది.

బ్యాంకుల్లో వడ్డీ రేట్లు
బ్యాంకుల్లో FD సురక్షిత పెట్టుబడిగా భావించవచ్చు. వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. ప్రధాన బ్యాంకులు 5.4 శాతం నుండి 5.5 శాతం వరకు ఉన్నాయి. ఎస్బీఐ FD వడ్డీ రేటు వివిధ కాలపరిమితులపై 2.9 శాతం నుండి 5.4 శాతం వడ్డీని చెల్లిస్తుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు 7.6 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications