A Oneindia Venture

tax saving:భార్య అకౌంట్‌లోకి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తే.. పన్ను ఆదా అవుతుందా? నిజాలు తెలుసుకోండి!

చాలామంది ట్యాక్స్ పేయర్స్.. పన్ను ఆదా చేయడానికి రకరకాల ఆప్షన్స్ కోసం చూస్తుంటారు. కొంతమంది పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి తమ భార్యల ఖాతాకు డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తుంటారు. అయితే అసలు ఈ టెక్నిక్ నిజంగా పనిచేస్తుందా? ప్రభుత్వ చట్టం ప్రకారం రూల్స్ తెలుసుకుందాం.

అది చట్టబద్ధమేనా?

భర్త తను పన్ను చెల్లించిన ఆదాయాన్ని భార్య ఖాతాకు బదిలీ చేయొచ్చు. కానీ, పన్ను చెల్లించని డబ్బుని పంపడం చట్ట పరంగా లీగల్ కాదు. డాన్ని నిరోధించవు. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 56(2) ప్రకారం జీవిత భాగస్వామి నుంచి అందుకున్న ఏ డబ్బు కూడా పన్ను పరిధిలోకి రాదు. కాబట్టి, పన్ను చెల్లించిన తర్వాత ఆ ఆదాయాన్ని భార్య ఖాతాకు బదిలీ చేయడం తప్పు కాదు.

బదిలీ చేసిన డబ్బు నుండి ఆదాయం వస్తే..

ఒకవేళ మీ భార్యకు బదిలీ చేసిన ఆస్తుల నుండి ఆదాయం వస్తే.. దాన్ని క్లబ్బింగ్ ఆఫ్ ఇన్ కమ్ (Clubbing of Income)అంటారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 64(1)(iv) ప్రకారం ఆ బదిలీ చేసిన మొత్తం భర్త ఆదాయంతోనే లెక్కించబడుతుంది. భర్తే దానిపై పన్ను చెల్లించాలి. ఉదాహరణకు షేర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆదాయం వంటివి. అంతేకాదు, భర్త బహుమతిగా ఇచ్చిన డబ్బును భార్య తన పేరు మీద లిస్టెడ్ షేర్లలో లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాల్లో పెట్టుబడి పెట్టినా, ఆ పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయం భర్త ఆదాయంతోనే కలపబడుతుంది.

spouse money transfer clubbing income tax saving india

మినహాయింపులు ఇవే..

  • ఒకవేళ భర్త భార్యకు డబ్బును అప్పు గా ఇస్తే.. ఆ డబ్బు భర్త ఆస్తిగానే మిగిలిపోతుంది. ఈ సందర్భంలో క్లబ్బింగ్ నిబంధనలు వర్తించకపోవచ్చు. అలాగే భర్త.. భార్య వ్యక్తిగత ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుని ఆమె దాచిపెట్టుకుని పెట్టుబడిగా పెట్టి కొంత లాభం పొందితే ఆ ఆదాయం భర్త ఆదాయంతో క్లబ్ కాకపోవచ్చు. దీన్ని కొన్ని పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను నుంచి మినహాయింపు పొందొచ్చు.
  • భర్త బదిలీ చేసిన డబ్బుతో భార్య ట్యాక్స్ సేవింగ్స్ పథకాల్లో పెట్టుబడి పెడితే.. అంటే PPF, సుకన్య సమృద్ధి యోజన లేదా ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ వంటి పథకాలలో పెట్టుబడి పెడితే ఆ ఆదాయం చట్ట ప్రకారం పన్ను మినహాయింపుని పొందుతుంది. కాబట్టి దానిపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇది అన్నింటికంటే బెస్ట్ ఆప్షన్.

ఇదే బెటర్

చివరిగా తెలిసిందేంటంటే.. పన్ను ఆదా చేయడం(tax saving) కోసమని జీవిత భాగస్వామి ఖాతాకు డబ్బు బదిలీ చేస్తే.. ఆ సంగతి బ్యాంకులకు, ఇన్ కమ్ ట్యాక్స్ వారికి తెలిసిపోతుంది. అప్పుడు క్లబ్బింగ్ నిబంధనల ప్రకారం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ పైన చెప్పిన విధానాల్లోని భార్య పెట్టుబడి పెడితే అప్పుడు పన్ను మినహాయింపు పొందొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+