సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22(సిరీస్ VIII) సోమవారం (నవంబర్ 29) నుండి ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఈ గోల్డ్ బాండ్స్‌ను జారీ చేస్తుంది. గోల్డ్ బాండ్ ధరను రూ.4,791గా నిర్ణయించింది. ఎవరైనా డిజిటల్ మోడ్‌లో దరఖాస్తు చేసుకుంటే ఒక గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. అంటే పది గ్రాముల బంగారంపై రూ.500 డిస్కౌంట్ వర్తిస్తుంది. డిజిటల్ మోడ్‌లో దరఖాస్తు చేసుకునే ఇన్వెస్టర్లకు గోల్డ్ బాండ్ రూ.4741కే వర్తిస్తుంది. అంతకుముందు సిరీస్ గోల్డ్ బాండ్ ధర రూ.4,761గా ఉంది. భౌతిక బంగారం డిమాండును తగ్గించడం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు ఉపయోగించే ఆర్థిక పొదుపుగా మార్చాలనే లక్ష్యంతో సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని నవంబర్ 2015వ తేదీన కేంద్రం ప్రారంభించింది.

గోల్డ్ బాండ్ వడ్డీ రేటు, పన్ను
బ్యాంకు ద్వారా లేదా పోస్టాఫీస్ ద్వారా కూడా గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. గోల్డ్ బాండ్స్ పెట్టుబడులకు 2.50 శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. పసిడి బాండ్స్‌పైన పెట్టుబడిదారులకు సంవత్సరానికి ఇచ్చే 2.50 శాతం వడ్డీ రేటును రెండు దభాలుగా చెల్లిస్తారు. ఇది ఇష్యూ చేసిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఓసారి వడ్డీ చెల్లిస్తారు. సావరీన్ గోల్డ్ బాండ్లపై అందుకున్న వడ్డీకి పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం వ్యక్తిగత ఆదాయంతో కలిపి వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ లేదా సోర్స్ వద్ద పన్ను విధించరు. సావరీన్ గోల్డ్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాలకు పన్ను వర్తించదు. పసిడి దిగుమతులు తగ్గించి ఆర్థిక లోటును అదుపు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.

గోల్డ్ బాండ్ ధర నిర్ణయం
బాండ్ కొనుగోలు చేసిన సమయానికి ముందు ఇండియా బులియన్, జ్యువెల్లరీస్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం మూడు రోజుల ధరల సరాసరిని ఆధారంగా తీసుకొని బాండ్స్ విక్రయిస్తారు.
గోల్డ్ బాండ్ ధర భారత కరెన్సీ రూపాయిలలో నిర్ణయిస్తారు. 1 గ్రాము నుండి కొనుగోలు చేయవచ్చు. ఎనిమిదేళ్లు బాండ్ పీరియడ్ ఉంటుంది. ఐదవ సంవత్సరం తర్వాత నిష్క్రమణకు అవకాశముంది. మెచ్యూరిటీ ధర అప్పటి ధరపై ఆధారపడి ఉంటుంది.

కొనుగోలు.. ఎంత
స్టాక్ ఎక్స్చేంజెస్.. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ లేదా నేరుగా ఏజెంట్స్ ద్వారా గోల్డ్ బాండ్స్‌ను కొనుగోలు చేయవచ్చు. పోస్టాఫీస్, బ్యాంకుల్లోను దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తులు కనీసం ఒక గ్రాము నుండి 4 కిలోల వరకు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు వంటివి అయితే 20 కిలోలు కొనుగోలు చేయవచ్చు.
ఈ బాండ్స్ ద్వారా రుణ సదుపాయం పొందవచ్చు. బాండ్స్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఎలాంటి మూలధన పన్ను చెల్లించకుండా పూర్తి డబ్బును పొందవచ్చు.

ముందే నిష్క్రమిస్తే
బాండ్స్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. ముందే నిష్క్రమించేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఎక్స్చేంజీలో లిస్టయిన బాండ్స్‌ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించాలి. లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదో సంవత్సరం తర్వాత బాండ్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండు సందర్భాలలో మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఎక్స్చేంజీల ద్వారా విక్రయిస్తే కొనుగోలు చేసిన తేదీ నుండి మూడేళ్ల లోపు ఉండే స్వల్పకాలంగా పరిగణిస్తారు. మెచ్యూరిటీకి ముందు గోల్డ్ బాండ్స్ తీసుకోవాలనుకుంటే కూపన్ చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు సంబంధిత బ్యాంకు లేదా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్టాఫీస్ లేదా ఏజెంట్‌ను సంప్రదించాలి. కూపన్ చెల్లింపు తేదీకి కనీసం ఒకరోజు ముందు పెట్టుబడిదారు సంబంధిత బ్యాంకు/పోస్టాఫీసును సంప్రదిస్తేనే ముందస్తు ఉపసంహరణ అభ్యర్థనలు ఆమోదం పొందుతాయి. బాండ్ కోసం దరఖాస్తు చేసే సమయంలో అందించిన బ్యాంకు ఖాతాకు ఆదాయం జమ అవుతుంది. అయిదో సంవత్సరం తర్వాత తీసుకుంటే లాభాలపై పోస్ట్ ఇండెక్సేషన్‌తో 20% పన్ను వర్తిస్తుంది.
ఒకవేళ పెట్టుబడిదారు మధ్యలో తన బాండును ఇతరులకు బదలీ చేస్తే దీర్ఘకాలిక మూలధన వడ్డీ చెల్లించాలి.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..



Click it and Unblock the Notifications