కొన్ని క్రిప్టోకరెన్సీలు అధిక రిస్క్, మనీ అంతా కోల్పోవచ్చు
ఇటీవల వివిధ క్రిప్టోకరెన్సీలు భారీగా ఎగిసిపడుతోన్న విషయం తెలిసిందే. ప్రధానంగా క్రిప్టో కింగ్‌గా భావించే బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతూ, సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బిట్ కాయిన్ వ్యాల్యూ గత నెలలో 58వేల రికార్డును దాటింది. తాజాగా ఈ వారం 61వేల డాలర్లను క్రాస్ చేసింది. బిట్ కాయిన్ సహా వివిధ క్రిప్టోకరెన్సీలపై ఇన్వెస్టర్లు ఇటీవల పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. అయితే కొన్ని క్రిప్టో అనూహ్యంగా పెరిగినప్పటికీ, రిస్కీగా కనిపిస్తోందని, ఇలాగే దూసుకెళ్తే ఇన్వెస్టర్లు తమ మనీని కోల్పోయే ప్రమాదం ఉందని మార్కెట్ రెగ్యులేటర్స్ హెచ్చరిస్తున్నారు.
క్రిప్టో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని క్రిప్టో అసెట్స్ హైలీరిస్క్‌గా ఉన్నాయని, కొనుగోలు లేదా హోల్డింగ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, కొన్ని కరెన్సీలు పడిపోతే ఇన్వెస్టర్లు పూర్తిగా డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

2012 నుండి 2018 వరకు క్రిప్టో నెమ్మదిగా ముందుకు కదిలిందని, ఈ సమయంలోను పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. అయితే కరోనా అనంతరం క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరిగిందని, ఇది ఊహించని విధంగా దూసుకెళ్తోందని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేస్తున్నారు.
ఏడాది కాలంలో బిట్ కాయిన్ వ్యాల్యూ 1,000 శాతం వరకు ఎగిసిపడింది. 2020 నాలుగో త్రైమాసికం చివరి నాటికి 29,000 డాలర్ల స్థాయిలో ఉన్న ఈ క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ ఆ తర్వాత ఏకంగా 58,000 డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 45వేల దిగువకు పడిపోయినప్పటికి, తిరిగి పుంజుకుంది. తాజాగా కొత్త గరిష్టం 61,000 డాలర్లను తాకింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వంటి ఇన్వెస్టర్లు బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడం, దీనికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి వివిధ కారణాలతో బిట్ కాయిన్ దూసుకెళ్తోంది.


Click it and Unblock the Notifications