నెలవారీ EMI తగ్గించుకోవడానికి ఈ పద్ధతులు పాటించండి
ఈరోజుల్లో విద్య, వైద్యం, పెళ్లి ఖర్చు లేదా హోమ్ రినోవేషన్ లాంటి తక్షణ అవసరాల కోసం వ్యక్తిగత రుణాన్ని (Personal Loan) తీసుకుంటున్నారు . కొందరు రుణం తీసుకున్న తర్వాత ప్రతి నెలా చెల్లించాల్సిన EMI వల్ల ఆర్థిక ఒత్తిడికి లోనవుతారు. ఎలాగైనా EMIని తగ్గించుకుని డబ్బు ఆదా చేసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఎలా? దీని కోసం కొన్ని బేసిక్ మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు కొందరికి నెలలో చాలా నెలవారి వాయిదాలు (EMI) చెల్లిస్తా ఉంటారు. అలాంటివారు స్మార్ట్‌గా ప్లాన్ చేస్తే, EMIని తగ్గించుకోవచ్చు, అలాగే ఆర్ధికంగా స్టేబుల్‌గా ఉండేందుకు డబ్బు ఎలా ఆదా చేయాలో తెలుసుకుందాం.

రుణాన్ని ట్రాన్స్ఫర్ చేయండి
మీరు తీసుకున్న రుణంపై వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్లైతే, వేరే బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ నుంచి ఎక్కడ తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తుందో చూసుకొని అక్కడికి రుణాన్ని బదిలీ చేయొచ్చు. దీనివల్ల మీ EMI తగ్గుతుంది. ఉదాహరణకి: మీరు ప్రస్తుతం 14% వడ్డీ రేటుతో రుణం తీసుకున్నట్లయితే, 10% వడ్డీ రేటుతో రీఫైనాన్స్ చేస్తే మీ EMI తక్కువగా పడుతుంది.
అధిక ప్రీపేమెంట్ చేయండి
మీకు తాత్కాలికంగా అదనపు డబ్బు చేతికి వచ్చినప్పుడు - బోనస్, ఫిక్స్డ్ డిపాజిట్, గిఫ్ట్ డబ్బు లాంటివి ఏదైనా EMIకి పైన ప్రీపేమెంట్ చేసేందుకు ఉపయోగించవచ్చు. దీని వలన రుణ కాలపరిమితి తగ్గుతుంది మరియు మొత్తంగా చెల్లించే వడ్డీ కూడా తగ్గుతుంది.
రుణ కాలాన్ని పెంచండి
మీ EMIలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే, రుణ కాలవ్యవధిని పెంచాలని బ్యాంకును అడగొచ్చు. దీని వలన నెలవారీ EMI తగ్గుతుంది. అయితే దీని వల్ల మొత్తం వడ్డీ బాగా పెరగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి.
ఆటో డెబిట్ లేదా ECS ఉపయోగించండి
ఆటో డెబిట్ ద్వారా మీరు మానవ తప్పిదాలను నివారించవచ్చు. కొన్ని బ్యాంకులు ఈ విధంగా చెల్లించిన వారికి తక్కువ వడ్డీ ఇచ్చే అవకాశమిస్తుంది. సకాలంలో చెల్లింపులు వల్ల లేట్ ఫీజులు లేకుండా అన్ని EMIలు టైమ్‌కి కట్టేయవచ్చు. ప్రతిసారీ మానవీయంగా లాగిన్ అయి చెల్లించాల్సిన పనిలేదు. టైమ్‌కి పేమెంట్స్ జరగడం వల్ల మీ సిబిల్ స్కోర్ మెరుగవుతుంది.
ఫ్లాట్ వడ్డీ రేటును కాకుండా రెడ్యూసింగ్ వడ్డీ రేటును ఎంచుకోండి
రుణం తీసుకునే సమయంలో 'Reducing Interest Rate' పథకాన్ని ఎంచుకుంటే, EMIలు తగ్గుతాయి, ఎందుకంటే వడ్డీ తగ్గినా కూడా బ్యాలెన్స్ మీదే లెక్కవుతుంది.
నెలవారీ ఖర్చులను సమీక్షించండి
మీ నెలవారీ ఖర్చులను ఒకసారి పరిశీలించండి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. దాంతో మీరు కొంత డబ్బును ఆదా చేసి, దాన్ని EMI చెల్లింపులకు లేదా ముందస్తు చెల్లింపులకు వాడుకోవచ్చు.
ఇతర రుణాలను క్లబ్ చేసి కంసాలిడేట్ చేయండి
మీకు ఇతర రుణాలు కూడా ఉంటే, వాటిని కలిపి ఒక్కటిగా మార్చడం వల్ల మీపై ఉండే మొత్తాన్ని మేనేజ్ చేయడం సులభమవుతుంది. దీన్ని Loan Consolidation అంటారు.
వ్యక్తిగత రుణాన్ని ఇలా సరిగ్గా ప్లాన్ చేస్తే ఆర్థిక ఇబ్బందికి గురికాకుండా ఉంటారు. EMI తగ్గించుకోవడం ద్వారా మీరు నెలవారీ బడ్జెట్‌ను తగ్గించుకోగలరు, అలాగే పొదుపు కూడా పెంచుకోవచ్చు. పై మార్గాలు పాటిస్తే, మీరు వడ్డీ భారం తగ్గించుకోవడమే కాక, త్వరగా రుణం పూర్తిచేసే అవకాశాన్ని పొందవచ్చు.


Click it and Unblock the Notifications