ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 15 లోపు ఐటీ రిటర్న్ దాఖలు చేయాలి. లేకుండా రూ. 5 వేల వరకు పెనాల్టీ పడవచ్చు. అయితే పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారుల నుంచి గడువు పొడిగింపుపై తాజాగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఐటీఆర్ పోర్టల్లో ధ్రువీకరణ లోపాలు, అప్‌లోడ్ నెమ్మదించడం, ఫారం 26ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్‌లో అసమతుల్యత వంటి సాంకేతిక లోపాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దీని వల్ల ఐటీ రిటర్న్ దాఖలు చేయడంలో జాప్యం జరుగుతోందన్నారు. కాబట్టి తేదీ పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక మధ్యతరగతి కుటుంబాలకు పన్ను ఆదా చేయడం చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ కుటుంబాలలో సంవత్సరానికి 15 నుండి 20 లక్షల ఆదాయం ఉన్న వారు ఉన్నారు. వీరిలో పెద్ద నగరాలలో నివసిస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే మధ్యతరగతి వారి ఆదాయం పెరిగింది కానీ ద్రవ్యోల్బణం కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ఒక కుటుంబం యొక్క నెలవారీ ఆదాయం రూ. లక్ష అయినప్పటికీ, నగరాల్లో అది ఇప్పటికీ తక్కువగానే ఉంటుంది.

ఎందుకంటే ఇంటి అద్దె, కిరాణా వస్తువులు, ఇతర ముఖ్యమైన వస్తువులు, పిల్లల పాఠశాల ఫీజులు, రుణాల EMI వంటి వాటి కారణంగా బడ్జెట్ సరిపోకపోవచ్చు. ఆదాయ స్లాబ్ కారణంగా, మధ్యతరగతి వారు పన్ను పరిధిలోకి వస్తారు. అయితే వారు ఆదా చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మీరు Tax ఆదా చేయగల 7 మార్గాలను మీకు అందిస్తున్నారం.. పన్ను ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకుని ప్రయత్నించి చూడండి. అవేంటంటే..
EPFలో పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు: మీరు నెల వారీ జీతం పొందే వ్యక్తి అయితే.. మీరు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా Tax ఆదా చేసుకోవచ్చు. ఇది ఉద్యోగులు, యజమానులు విరాళాలు చెల్లించే పదవీ విరమణ నిధిగా చెప్పుకోవచ్చు. మీరు EPF ఖాతాలో జమ చేసిన మొత్తంపై వడ్డీని పొందుతారు. అలాగే పన్నును కూడా ఆదా చేస్తారు.
PPFలో పెట్టుబడి పెట్టడం: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక ప్రభుత్వ పథకం. దీనిలో మీరు రూ. 500 నుండి రూ. 1.5 లక్షల వరకు ఖాతా తెరవవచ్చు. ఈ నిధిలో జమ చేసిన మొత్తానికి మీకు వడ్డీ లభిస్తుంది. అలాగే పన్ను ఆదా కూడా కనిపిస్తుంది.
అద్దె ఇంటి ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు: మీరు అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లయితే కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు. మీ జీతంలో ఇంటి అద్దె భత్యం యాడ్ అయి ఉంటే అది మీకు పన్ను ఆదా చేయడానికి సహాయపడుతుంది. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(13A) ప్రకారం.. ఈ మినహాయింపు కొన్ని షరతులకు లోబడి అందుబాటులో ఉంటుంది.
ఆరోగ్య బీమా తీసుకోవడం ద్వారా పన్ను ఆదా: నేటి యుగంలో పెరుగుతున్న చికిత్స ఖర్చులను భరించాలంటే ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఆరోగ్య బీమా ఉండాలి. ఆరోగ్య బీమా తీసుకోవడం ద్వారా, మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80d కింద ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.
జాతీయ పెన్షన్ పథకంలో పెట్టుబడులు: తక్కువ రిస్క్ తో పదవీ విరమణ ప్రణాళిక చేసుకోవాలనుకునే వారికి జాతీయ పెన్షన్ పథకం ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పవచ్చు. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా.. మీ పెట్టుబడి సురక్షితంగా ఉండటమే కాకుండా పన్ను ఆదా కూడా ఉంటుంది.
జీవిత బీమా తీసుకోవడం మరువొద్దు: ఆరోగ్య బీమా లాగే, మీరు జీవిత బీమా కూడా తీసుకోవాలి. ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ఇది మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. మీరు కావాలనుకుంటే టర్మ్ బీమా కూడా తీసుకోవచ్చు. పన్ను ఆదా చేసుకోగల అనేక బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
FD చేయడం ద్వారా పన్ను ఆదా: మధ్యతరగతి వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి ఎంపికగా చెప్పవచ్చు. మీరు పన్ను ఆదా చేసే FDలో మీ డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. అలాగే పన్నులను కూడా ఆదా చేసుకోవచ్చు. మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80c కింద పన్ను మినహాయింపును పొందవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications