మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడైనా సురక్షితంగా దాచుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు పోస్టాఫీసు పథకాలు (Post Office Scheme) ఒక అద్భుతమైన ఆప్షన్. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుండి జూన్ 30, 2026 వరకు అమల్లో ఉండేలా చిన్న మొత్తాల పొదుపు పథకాల కొత్త వడ్డీ రేట్లను విడుదల చేసింది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ గ్యారెంటీతో స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఇవి సరైన వేదిక.

అత్యధిక లాభాన్ని ఇచ్చే టాప్ స్కీమ్స్
ఈ క్వార్టర్ లో అందరినీ ఆకర్షిస్తున్న పథకాలు ఇవే..
- సుకన్య సమృద్ధి యోజన (SSY): ఆడపిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది బెస్ట్ ఆప్షన్. దీనిపై ప్రస్తుతం 8.2% వడ్డీ లభిస్తోంది.
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): పదవీ విరమణ చేసిన వారికి క్రమబద్ధమైన ఆదాయంతో పాటు 8.2% భారీ వడ్డీని ప్రభుత్వం అందిస్తోంది.
మిడ్-రేంజ్ రిటర్న్స్ ఇచ్చే ఆప్షన్లు
మీకు 7% నుండి 7.7% మధ్యలో వడ్డీ కావాలనుకుంటే ఈ కింది పథకాలను పరిశీలించవచ్చు:
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC): దీనిపై 7.7% వడ్డీ వస్తుంది.
- కిసాన్ వికాస్ పత్ర (KVP): మీరు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అయ్యే ఈ పథకంపై 7.5% వడ్డీ లభిస్తుంది.
- మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS): నెలకు కొంత ఆదాయం రావాలనుకునే వారికి ఇది మంచిది, దీనిపై 7.4% వడ్డీ ఉంది.
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): దీర్ఘకాలికంగా కోటీశ్వరులు కావాలనుకునే వారి ఫేవరెట్ స్కీమ్ ఇది. దీనిపై 7.1% వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Time Deposits)
బ్యాంక్ ఎఫ్‌డీల మాదిరిగానే పోస్టాఫీసులో కూడా టైమ్ డిపాజిట్లు ఉంటాయి. వీటి కాలపరిమితిని బట్టి వడ్డీ మారుతుంది..
- 1 ఏడు: 6.9%
- 2 ఏళ్లు: 7.0%
- 3 ఏళ్లు: 7.1%
- 5 ఏళ్లు: 7.5% (దీనిపై సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం కూడా పొందవచ్చు).
సేవింగ్స్ అకౌంట్ , ఆర్‌డీ (RD)
తక్కువ వడ్డీ ఉన్నప్పటికీ, అత్యవసరంగా డబ్బు తీసుకోవడానికి ఇవి బాగుంటాయి. రికరింగ్ డిపాజిట్ (RD) పై 6.7% వడ్డీ ఉండగా, సాధారణ సేవింగ్స్ అకౌంట్‌పై 4.0% వడ్డీ లభిస్తోంది.
ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు
ఏ పోస్టాఫీసు స్కీమ్ (Post Office Scheme) ఎంచుకున్నా, అది మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. ఈ పోస్టాఫీసు పథకాల్లో (Post Office Scheme) పెట్టుబడి పెట్టడం వల్ల కేవలం లాభమే కాకుండా, మీ సొమ్ముకు అత్యున్నత స్థాయి భద్రత కూడా లభిస్తుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ వంటి పథకాలు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఒకే పథకంలో మొత్తం డబ్బును పెట్టకుండా, మీ అవసరాలను బట్టి అంటే.. పిల్లల చదువుల కోసం ఒకటి, నెలవారీ ఖర్చుల కోసం (MIS) మరొకటి దీర్ఘకాలిక సంపద కోసం పీపీఎఫ్ వంటి వాటిని ఎంచుకోవడం ద్వారా మీ పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేసుకోవచ్చు.ఈ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్నవి కాబట్టి మీ సొమ్ముకు 100% భద్రత ఉంటుంది.


Click it and Unblock the Notifications