ఇప్పటి తరం యువత చిన్న వయస్సులోనే పెట్టుబడులు పెట్టాలని ఆశపడుతున్నారు. అయితే, చాలామందికి పెద్ద మొత్తాలు చేతిలో ఉండవు. అలాంటి వారికోసం ఒక చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో పెద్ద ఆదాయానికి మారగలదు. మీరు 25 ఏళ్ల వయస్సులో రూ. 3 లక్షలు ఒక్కసారిగా పెట్టుబడి పెడితే, 55 ఏళ్ల తర్వాత మీకు నెలనెలా స్థిరమైన ఆదాయం వస్తుంది. ఎలా అంటే?

మీరు పెట్టిన డబ్బు మీద వచ్చే లాభం మళ్లీ అదే పెట్టుబడిలో కలిసిపోతూ పెరుగుతూ పోతుంది. దీన్నే కాంపౌండింగ్ (చక్రవృద్ధి) అంటారు. ఇది కాలంతో ఉన్నంత వరకూ పెరుగుతూనే ఉంటుంది.
ఉదాహరణకు, రూ. 3 లక్షలు మీరు మంచి లాభాలు ఇచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టితే, సగటున 12% వార్షిక వృద్ధి రేటుతో 30 ఏళ్ల తర్వాత (55 ఏళ్లకి) అది దాదాపు రూ.89.88 లక్షలుగా మారుతుంది. అది కూడా ఎలాంటి అదనపు పెట్టుబడి లేకుండా ఒక్కసారిగా పెట్టిన డబ్బు మాత్రమే.
55 ఏళ్లకి మీరు ఉద్యోగం మానేసి విశ్రాంతి తీసుకుంటే, ఆ రూ 89.88 లక్షలతో మీరు SWP (Systematic Withdrawal Plan) ద్వారా నెలనెలా డబ్బు తీసుకోవచ్చు.
SWP అంటే:
మీరు పెట్టిన డబ్బు నుంచి, ప్రతి నెల మీరు ఒక స్థిరమైన మొత్తం తీసుకుంటారు. మిగిలిన డబ్బు మ్యూచువల్ ఫండ్‌లోనే ఉంటుంది, అది ఇంకా పెరుగుతుంది.
దీని మీద పన్నులు ఎలా ఉంటాయి?
30 ఏళ్లలో మీరు పొందిన లాభం దాదాపు రూ. 86.88 లక్షలు. కానీ పన్ను నుంచి మినహాయింపు రూ. 1.25 లక్షల వరకు ఉంటుంది. మిగతా లాభంపై 12.5% లాంగ్‌టర్మ్ కాపిటల్ గైన్స్ టాక్స్ (LTCG) వసూలవుతుంది. అందువల్ల, పన్ను చెల్లించాక మీరు పొందే మొత్తం సుమారుగా రూ. 79.17 లక్షలు ఉంటుంది.
ఈ మొత్తం మీద నెలనెలా ఎంత వస్తుంది?
ఈ రూ 79.17 లక్షలపై మీరు మరో 30 సంవత్సరాలు (85 ఏళ్ల వరకు) SWP ద్వారా నెలనెలా డబ్బు తీసుకుంటే సగటున 7% వడ్డీ రేటు ఉంటుందని అంచనా వేసుకుంటే, ప్రతి నెల రూ. 52,370 వరకూ పొందవచ్చు. ఇది చక్కటి స్థిర ఆదాయంగా పనిచేస్తుంది. ఉద్యోగం లేకున్నా నెలనెలా ఖర్చుల కోసం ఆదాయం వస్తుంది.
ఎవరు ఈ ప్లాన్‌ను ఆలోచించాలి?
ఈ విధమైన పెట్టుబడి పద్ధతి ఎరికి ఉపయోగపడుతుంది యువత కనీసం 25 ఏళ్ల వయస్సులో పెట్టుబడి చేయగలవారు. పెద్ద మొత్తాలు డబ్బు పెట్టలేనివారు, కానీ భవిష్యత్తులో స్థిర ఆదాయం కోరేవారికి ఇది ఉపయోగపడుతది.
మ్యూచువల్ ఫండ్స్ పైన కొంత అవగాహన కలిగినవారు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
1. నమ్మకమైన మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవాలి. దీన్ని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచనతో ఎంచుకోండి.
2. ఫండ్ పనితీరు తరచూ చెక్ చేయాలి. కానీ మధ్యలో తీసేయకుండా ఉండాలి.
3. పన్నుల ప్రణాళిక గురించి ముందుగానే తెలుసుకోవాలి.
చిన్న పెట్టుబడి, పొదుపుగా ఆలోచించే మైండ్‌సెట్, మరియు ఓర్పుతో మీరు భవిష్యత్తులో నెలనెలా స్థిర ఆదాయం పొందవచ్చు. ఇది లక్షలాది రూపాయల రిటైర్మెంట్ ప్లాన్‌ల కన్నా మంచి పద్ధతి. మీరు కూడా మీ జీవితాన్ని రిటైర్మెంట్ తరువాత ప్రశాంతంగా గడపాలనుకుంటే, ఈరోజే ఓ నిర్ణయం తీసుకోండి. రూ 3 లక్షలతో మొదలుపెట్టి, భవిష్యత్తులో నెలనెలా ఆదాయం పొందే దిశగా సాగండి.
Disclaimer: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications