వివిధ ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ పైన వడ్డీ రేటును అందిస్తాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ప్రభుత్వ, ప్రయివేటు దిగ్గజ బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో ఒకటి. ఇది నిర్ణీత కాల వ్యవధి తర్వాత నిర్దిష్ట ఆదాయాన్ని కలిగి ఉండేలా చేస్తుంది. పెద్ద బ్యాంకులు ఇచ్చే FD వడ్డీ రేటు కంటే కొన్ని చిన్న బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి.. అవేమిటో తెలుసుకుందాం...

పెద్ద బ్యాంకుల్లో వడ్డీ రేటు
వివిధ ప్రయివేటు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
యాక్సిస్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.75 శాతం, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50 శాతంగా ఉంది.
HDFC బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.50 శాతం, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది.
ICICI బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.60 శాతం, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.30 శాతంగా ఉంది.
ఇండస్ఇండ్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.50 శాతం, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00 శాతంగా ఉంది.
యస్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.25 శాతం, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00 శాతంగా ఉంది.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు
వివిధ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో FD వడ్డీ రేటు 6.00 శాతం, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50 శాతంగా ఉంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో FD వడ్డీ రేటు 6.25 శాతం, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00 శాతంగా ఉంది.
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో FD వడ్డీ రేటు 6.75 శాతం, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00 శాతంగా ఉంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో FD వడ్డీ రేటు 6.00 శాతం, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50 శాతంగా ఉంది.

అక్కడే ఎక్కువ
సాధారణంగా పెద్ద బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ సాధారణ వడ్డీ రేట్లు 5.50 శాతం నుండి 6.25 శాతం వరకు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ అయితే ఆరు శాతం నుండి ఏడు శాతం వరకు ఉన్నాయి.
అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో సాధారణ వడ్డీ రేటు కనీసం 6 శాతం నుండి 6.75 శాతం వరకు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్‌కు ఏడు శాతం వరకు ఉన్నాయి.


Click it and Unblock the Notifications