Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులు ఇవే..!
సీనియర్ సిటిజన్లకు పలు బ్యాంకులు అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తోన్నాయి. సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై 8.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇందులో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అత్యధిక రాబడిని అందిస్తున్నాయి. ప్రైవేట్ రంగ, ప్రభుత్వ రంగ, విదేశీ బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్లకు పోటీతత్వంతో కూడిన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం వరకు ఎఫ్డీ వడ్డీ రేట్లను అందిస్తోంది. ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం వరకు ఎఫ్డీ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.30 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.30 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వరకు వడ్డీ చెల్లిస్తోంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.9 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.75 శాతం వరకు వడ్డి అందిస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల్లో SBM బ్యాంక్ ఇండియా 8.15 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది. DCB బ్యాంక్ 8.00 శాతం వరకు FD వడ్డీ రేట్లను చెల్లిస్తోంది.

బంధన్ బ్యాంక్ 7.95 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.75 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది. యెస్ బ్యాంక్ 7.75 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది.
RBL బ్యాంక్ 7.70 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది. కోటక్ మహీంద్ర బ్యాంకు 7.3 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. యాక్సిస్ బ్యాంక్ 7.25 శాతం వడ్డీ చెల్లిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 7.10 శాతం వడ్డీ అందిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ 7.20 శాతం వడ్డీ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు ఎఫ్డీ పై 7.1 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఐడీబీఐ బ్యాంకు 7 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. సిటీ యూనియన్ బ్యాంక్ ఎఫ్డీ పై 7.5 శాతం వడ్డీ రేట్లు చెల్లిస్తోంది.
ప్రభుత్వం బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.45 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది. పంజాబ్ & సింద్ బ్యాంక్ 7.35 శాతం వరకు FD వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 7.25 శాతం వరకు FD వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.15 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.05 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్డీపై 7.05 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఫారిన్ బ్యాంకుల్లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.10 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. డాయిష్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.00 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.00 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
