మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారిలో చాలామందికి వచ్చే పెద్ద డౌట్ ఇది. ప్రతి నెలా రూ. 10,000 SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) లో పెట్టుబడి పెట్టాలా, లేక ఏడాదికి ఒకసారి రూ. 1.2 లక్షలు (Lump Sum) పెట్టుబడి పెట్టాలా? ఈ రెండు పద్ధతులు కూడా మంచివే. అయితే అవి పనిచేసే విధానం, లాభాలు ఇచ్చే తీరు వేర్వేరుగా ఉంటాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
తేడా ఇదే..
SIP ఇన్వెస్ట్‌మెంట్‌కి, లంప్‌సమ్ మధ్య ప్రధాన తేడా.. మీ డబ్బు మార్కెట్‌లోకి ఎప్పుడు చేరుతుందనేది. అంటే.. మీరు రూ. 1.2 లక్షలు ఒకేసారి పెట్టినప్పుడు.. ఆ మొత్తం వెంటనే మార్కెట్‌లో పనిచేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు వడ్డీపై వడ్డీ (Compounding) లభిస్తుంది. ఒకవేళ మీరు నెలకు రూ. 10,000 చొప్పున SIP చేస్తుంటే మీ డబ్బు కొద్దికొద్దిగా మార్కెట్‌లోకి వెళ్తుంది. ఏకమొత్తం కంటే SIP ద్వారా మార్కెట్‌లో డబ్బు చేరడానికి 11 నెలలు ఎక్కువ సమయం పడుతుంది. అయితే మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఒకేసారి పెడితే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. SIP లో ఆ రిస్క్ తక్కువగా ఉంటుంది.

మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి..
మార్కెట్ అస్థిరత అనేది ఈ రెండు పద్ధతులపై వేర్వేరు ప్రభావాలను చూపుతుంది. SIP లు 'టైమింగ్ రిస్క్'ను తగ్గిస్తాయి. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు, ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేస్తారు. దీనివల్ల దీర్ఘకాలంలో స్థిరమైన లాభాలు పొందవచ్చు. మార్కెట్ ధరలు నిరంతరం పెరుగుతున్నప్పుడు ఒకేసారి పెట్టుబడి పెట్టిన లంప్ సమ్ ద్వారా మొత్తం డబ్బుపై లాభం వస్తుంది. కాబట్టి రాబడి ఎక్కువగా ఉంటుంది.
Lump Sum ఎప్పుడు పెట్టాలి?
కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే రూ. 1.2 లక్షల ఏకమొత్తం బాగా పనిచేస్తుంది. ఉదాహరణకు మార్కెట్ బాగా పడిపోయినప్పుడు.. తక్కువ ధరలో పెద్ద మొత్తంలో యూనిట్లు కొనడానికి ఇది మంచి అవకాశం. లేదా మార్కెట్ పడిపోయి.. మళ్లీ త్వరలో కోలుకుంటుంది అని మీకు నమ్మకం ఉన్నప్పుడు లంప్ సమ్ పెట్టడం లాభదాయకం. అయితే మార్కెట్ గురించి పెద్దగా తెలియని సాధారణ ఇన్వెస్టర్లు ఈ రిస్క్ తీసుకోకపోవడం మంచిది.
క్రమశిక్షణే ముఖ్యం
పెట్టుబడి పెట్టేటప్పుడు డబ్బు మొత్తం కంటే మీ క్రమశిక్షణే ముఖ్యం. SIP లు నెలవారీ జీతాలకు సరిపోతాయి. ఇది క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే అలవాటును పెంచుతుంది. SIP ద్వారా పెట్టుబడి పెడితే, మీరు ప్రతి నెలా మార్కెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దీనివల్ల తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది. అలాగే లంప్ సమ్ పెట్టేవారికి తక్కువ కాలంలో వచ్చే హెచ్చుతగ్గులను తట్టుకునే సామర్థ్యం ఉండాలి.
కంక్లూజన్ ఇదే..
ఇక కంక్లూజన్ విషయానికొస్తే.. రిస్క్ తీసుకోగలిగినవాళ్లు, మార్కెట్ అవకాశాల కోసం చూసే దూకుడు స్వభావం కలవారు లంప్ సమ్ ఎంచుకోవచ్చు. అలాగే స్థిరత్వాన్ని కోరుకునేవారు, ఒత్తిడి లేని స్థిరమైన పెట్టుబడిని కోరుకునేవారు SIP Investment ను ఎంచుకోవడం ఉత్తమం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications