ప్రతి నెలా జీతం రాగానే అద్దెలు, ఈఎంఐలు(EMI), సరుకులు అంటూ ఒక లెక్క వేసుకుంటాం. అంతా సవ్యంగానే ఉందనుకున్న సమయంలో.. అకస్మాత్తుగా కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సి రావడం, పిల్లల స్కూల్ ఫీజులు లేదా ఇంటి రిపేర్లు వంటివి వచ్చి పడతాయి. అప్పుడు ఏం చేస్తాం? వెంటనే క్రెడిట్ కార్డు తీయడమో లేదా స్నేహితుల దగ్గర అప్పు చేయడమో చేస్తుంటాం. కానీ, ఈ ఖర్చులు కొత్తవేమీ కావు. ఏడాదికోసారి వస్తాయని మనకు ముందే తెలుసు. ఇలాంటి 'ముందే తెలిసిన' ఖర్చుల కోసం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అద్భుతమైన మార్గమే సింకింగ్ ఫండ్. ఇదెలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సింకింగ్ ఫండ్ అంటే ఏమిటి?
భవిష్యత్తులో మనకు కచ్చితంగా ఎదురయ్యే ఒక నిర్దిష్టమైన ఖర్చు కోసం, ఇప్పటి నుంచే కొద్దికొద్దిగా డబ్బును పక్కన పెట్టే పద్ధతే సింకింగ్ ఫండ్ (sinking fund). ఉదాహరణకు.. మీరు ఏడాది తర్వాత ఒక విహారయాత్రకు వెళ్లాలనుకున్నా, లేదా ఆరు నెలల తర్వాత పండగ ఖర్చులు ఉంటాయని తెలిసినా.. ఆ మొత్తం కోసం ఇప్పుడే ఒక నిధిని (Fund) ఏర్పాటు చేసుకోవడం అన్నమాట. అప్పు తీసుకుని వాయిదాలు చెల్లించే కంటే.. ముందే వాయిదాల్లో డబ్బును దాచుకోవడం ఈ పద్ధతిలోని గొప్పతనం.

నిజానికి ఇది కార్పొరేట్ కంపెనీలు వాడే సూత్రం. పెద్ద కంపెనీలు తాము తీసుకున్న బాండ్ల అప్పును తీర్చడానికి ఏటా లాభాల్లో కొంత భాగాన్ని ఒక ప్రత్యేక ఫండ్ (fund) కు మళ్లిస్తాయి. దీనివల్ల గడువు ముగిసేసరికి కంపెనీపై ఒక్కసారిగా ఆర్థిక భారం పడదు. ఇదే ఫార్ములాను మనం కూడా పాటిస్తే ఆర్థికంగా దివాలా తీయకుండా ఉండొచ్చు.
ఎమర్జెన్సీ ఫండ్‌కు దీనికి తేడా ఏంటి?
చాలామంది పొదుపు ఖాతాలో డబ్బు ఉంటే చాలు అనుకుంటారు. కానీ, అత్యవసర నిధికి, సింకింగ్ ఫండ్‌కు చాలా తేడా ఉంది.
- అత్యవసర నిధి (Emergency Fund): ఇది కేవలం అనుకోని ఆపదల కోసం మాత్రమే. ఉద్యోగం పోవడం, అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యం వంటి వాటికి దీనిని వాడాలి.
- సింకింగ్ ఫండ్ (Sinking Fund): ఇది మనకు ముందే తెలిసిన ఖర్చుల కోసం. పిల్లల ఫీజులు, కార్ సర్వీసింగ్, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, పండగ షాపింగ్ వంటి వాటికి దీనిని వినియోగించాలి.
ఈ ఫండ్ ఎందుకు అవసరం?
మనం ఏదైనా వస్తువును క్రెడిట్ కార్డుపై కొని వాయిదాలుగా మార్చుకుంటే 14-16 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఈ ఫండ్ ద్వారా మీరు డబ్బు దాచుకుంటే, వడ్డీ కట్టాల్సిన అవసరం లేకపోగా.. బ్యాంకు నుంచే మీకు 4-6 శాతం వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా పెద్ద ఖర్చులు ఎదురైనప్పుడు కలిగే మానసిక ఒత్తిడిని ఇది తగ్గిస్తుంది. మీరు దాచుకున్న డబ్బుతో విహారయాత్రకు వెళ్లినప్పుడు, అక్కడ ఖర్చు గురించి చింతించకుండా ప్రయాణాన్ని ఆస్వాదించొచ్చు!
ఎక్కడ దాచుకోవాలి? ఎలా మొదలుపెట్టాలి?
ఈ నిధి ఉద్దేశం అధిక లాభాలు గడించడం కాదు, అవసరానికి డబ్బు అందుబాటులో ఉండటం (Liquidity). కాబట్టి నష్టభయం లేని మార్గాలను ఎంచుకోవాలి..
- రికరింగ్ డిపాజిట్ (RD): నెలకు ఇంత అని ఫిక్స్‌డ్ మొత్తాన్ని దాచుకోవచ్చు.
- లిక్విడ్ మ్యూచువల్ ఫండ్: అవసరమైనప్పుడు వెంటనే విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది.
- ఫ్లెక్సీ డిపాజిట్: పొదుపు ఖాతాలోనే ఉంటూ అధిక వడ్డీని ఇచ్చే మార్గాలను ఎంచుకోవచ్చు.
ఉదాహరణకు మీరు ఫ్యూచర్లో రూ.5 లక్షల విలువైన కారు కొనాలనుకుంటున్నారు. దీనికోసం ఇప్పటి నుంచే నెలకు ఒక ఫండ్ ఏర్పాటు చేసుకుని రూ.10,000 పక్కన పెడితే.. మూడు లేదా నాలుగేళ్ల తర్వాత ఎలాంటి అప్పు లేకుండా, పైగా వడ్డీ ఆదాయంతో కలిపి కారుని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజే మీ ఖర్చులను లెక్కగట్టి ఒక సింకింగ్ ఫండ్‌ను ప్రారంభించండి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications