ఆదాయం ఎంత ఉన్నా.. నెల గడిచే సరికి రూపాయి కూడా మిగలక ఇబ్బందిపడిపోతుంటారు చాలామంది. చేతిలో డబ్బుల్లేక క్రెడిట్ కార్డులు వాడడం లేదా అప్పు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఒక చిన్న ఫార్ములా ఫాలో అవ్వడం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించొచ్చు. అదే 40-30-20-10 రూల్. ఈ రూల్ సరిగ్గా ఫాలో అయితే మీ జేబులో డబ్బు ఎప్పుడూ ఉంటుంది. డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. దీన్ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఫార్ములా ఇలా..
40-30-20-10 అనేది ఒక బడ్జెటింగ్ ఫార్ములా. ఇందులో భాగంగా మీ ఆదాయాన్ని నాలుగు భాగాలుగా విభజించాలి. ఒక్కో భాగాన్ని ఒక్కో ప్రయోజనం కోసం కేటాయించుకోవాలి. ఈ రూల్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వడం ద్వారా అవసరం లేని ఖర్చులని చాలా వరకూ నియంత్రించుకోవచ్చు. ఈ ఫార్ములా ప్రకారం 40 శాతం అవసరాలకు, 30 శాతం సేవింగ్స్ కు, 20 శాతం అప్పులకు, 10 శాతం వినోదానికి కేటాయించాలి.
అవసరాలంటే..
ఈ ఫార్ములాలో భాగంగా 40 శాతం ఆదాయాన్ని అవసరాలకు కేటాయించాలి. అంటే ఫుడ్, నిత్యావసరాలు, ఇంటి అద్దె, పెట్రోల్ బిల్, కరెంట్ బిల్, గ్యాస్, ఇంటర్నెట్ వంటివి. అలాగే పిల్లల ఫీజులు ఇతర ముఖ్యమైన అవసరాలకు కూడా ఈ 40 శాతం నుంచే ఖర్చు చేయాలి.
సేవింగ్స్ అంటే..
ఇక మరో 30 శాతం సేవింగ్స్ కోసం కేటాయించాలి. ఏవైనా ప్రభుత్వ స్కీమ్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది లాంగ్ టర్మ్ లో అవసరమయ్యే ఖర్చుల కోసం పనికొస్తాయి.
అప్పులు అంటే..
ఇక 20 శాతం మొత్తాన్ని క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు, లోన్ ఈఎంఐల కోసం వాడాలి. ఒకవేళ ఎలాంటి లోన్స్ లేకపోతే దీన్ని సేవింగ్స్ లేదా అవసరాల విభాగంలో వాడుకోవచ్చు.
చివరగా వినోదం
ఇక మిగిలిన 10 శాతం ఆదాయాన్ని వినోదానికి వాడుకోవాలి. అంటే సినిమాలు, షాపింగ్ లు, రెస్టారెంట్స్, పార్క్స్ వంటివి..
ఇది ముఖ్యం
ఈ ఫార్ములా మీ ఆర్థిక జీవితాన్ని ఒక క్రమశిక్షణలో ఉంచుతుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించడానికి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు సాయపడుతుంది. మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి అవసరాలు, విలాసాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే పొదుపు కోసం కూడా కొంతమొత్తాన్ని కేటాయించాలి. ఇలా ఫార్ములా ప్రకారం ఖర్చు చేయడం ద్వారా నెలాఖరుకి బడ్జెట్ డెఫిషియట్ ఉండదు. ఇప్పటివరకూ వేటి కోసం అనవసరంగా ఖర్చు చేశారో తెలిసి వస్తుంది. అలాగే ఈ ఫార్ములా అందరికి వర్తిస్తుంది. క్రమం తప్పకుండా స్ట్రిక్ట్ గా ఈ రూల్ ఫాలో అయితే రిజల్ట్ తప్పక కనిపిస్తుందనేది ఆర్థిక నిపుణుల సలహా.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications