కంపెనీ లేదా కార్పోరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకు FDల మాదిరిగా ఉంటాయి. డిపాజిటర్లు తమ డబ్బును బ్యాంకుల కంటే ఇష్యూయింగ్ కంపెనీలో ఉంచుతారు. కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకు FDల కంటే అధిక రాబడిని అందించవచ్చు. అయితే కాస్త రిస్క్, కాలపరిమితి 12 నుండి 120 నెలల వరకు ఉంటుంది. పెద్ద రిస్క్‌లకు దూరంగా ఉండి, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలను కోరుకునే పెట్టుబడిదారులు, జాగ్రత్తగా పరిశీలించి, రిస్క్ అంశాన్ని విశ్లేషించుకొని, కాస్త రిస్క్ కలిగిన కంపెనీల్లో పెట్టుబడిని పరిశీలించవచ్చు. ఇలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తుంటే కనుక ప్రస్తుతం అధిక రాబడిని అందిస్తున్న టాప్ 10 కంపెనీలు ఇక్కడ ఉన్నాయి.

బ్యాంకు ఎఫ్‌డీ, కంపెనీ ఎఫ్‌డీ
బ్యాంకుల వంటి పలు కంపెనీలు, ఎన్బీఎఫ్‌సీలు నిర్ణీత కాల వ్యవధికి గాను నిర్ణీత వడ్డీ రేటుతో డిపాజిట్స్‌ను స్వీకరించేందుకు అనుమతి ఉంది. కార్పోరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేవి బ్యాంకు ఎఫ్‌డీ వంటి డిపాజిట్స్. ఇది హామీ రాబడి సెక్యూరిటీ, టర్మ్ ఎంపికను ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది. అంతేకాదు, పలు కార్పోరేట్ ఎఫ్‌డీలు బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటును అందిస్తాయి. బ్యాంకు FD, కార్పోరేట్ FDల మధ్య సారూప్యతలను ఇక్కడ చూడండి.
- అత్యంత ఆకర్షణీయ పెట్టుబడుల్లో కార్పోరేట్ పెట్టుబడి ఒకటి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వలె హామీ రాబడిని అందిస్తాయి. పెట్టుబడి సమయంలోనే మెచ్యూరిటీ సమయంలో మీకు ఎంత మొత్తం వస్తుందనే విషయం తెలుస్తుంది.
- ఇతర బ్యాంకు డిపాజిట్స్ వలె చాలా కార్పోరేట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేటును అందిస్తాయి. రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ పైన ఆధారపడే వారికి ఇది అదనపు ప్రయోజనం.
- ఒక కార్పోరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ సాధారణంగా ఒకటి నుండి అయిదేళ్ల మెచ్యూరిటీని కలిగి ఉంటుంది. ఈ శ్రేణిలో ఏదైనా వ్యవధిని ఎంచుకునే వెసులుబాటు ఉంది. వడ్డీ రేటు కూడా కాలపరిమితికి అనుగుణంగా మారుతుంది. ఎక్కువ కాలం ఉంటే కాస్త ఎక్కువ వడ్డీ రేటు వచ్చే అవకాశం ఉంది.

బ్యాంకు FDల కంటే కార్పోరేట్ FDలు ఎందుకు?
ఇన్వెస్టర్లు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బ్యాంకు FD కంటే కార్పోరేట్ FDలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని చెప్పవచ్చు. కింది కారణాలు కొన్ని చూడండి...
- కార్పోరేట్ వడ్డీ రేటు బ్యాంకు వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. కార్పోరేట్ వడ్డీ రేటు 5.25 శాతం నుండి 8 శాతం వరకు ఉంది. అదే సమయంలో బ్యాంకు వడ్డీ రేట్లు ప్రస్తుతం 5 శాతం నుండి 6 శాతం వరకు ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు కూడా అదనపు వడ్డీ రేటు ఉంది.
- CRISIL, ICRA, CARE వంటి క్రెడిట్ రేటింగ్ సంస్థలు కార్పోరేట్ FDsను విడుదల చేస్తున్నప్పుడు జారీ చేసే సంస్థల క్రెడిట్ స్కోర్స్‌ను నిర్ణయిస్తాయి.
- ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం అన్ని బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్స్‌కు కనీసం మూడు నెలల పెనాల్టీ వ్యవధి ఉండాలి. మొదటి మూడు నెలల కాలంలో మీ కార్పస్ ఉపసంహరించుకుంటే మీకు ముందస్తు ఉపసంహరణ పెనాల్టీ విధించబడుతుంది. అయితే బ్యాంకుల FD పెనాల్టీ కంటే తక్కువగా ఉంటుంది.

కార్పోరేట్ FDs
బ్యాంకులు వివిధ డిపాజిట్ వ్యవధిని ఏడు రోజుల నుండి ప్రారంభిస్తాయి. కార్పోరేట్ FD ఏడాది నుండి పదేళ్ల వరకు ఉంటుంది.
బ్యాంకుల నుండి ఉపసంహరణ సింపుల్. కార్పోరేట్ FD నుండి ఉపసంహరించుకోవడం కాస్త స్ట్రగుల్‌తో కూడిన పని.
డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (DICGC) కింద బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన రూ.5 లక్షల బీమా కవరేజీ ఉంది. కార్పోరేట్ FDలకు ఇది వర్తించదు.
బ్యాంకు FDలతో పోలిస్తే కార్పోరేట్ FDలు అంత సురక్షితం కాదు. కాస్త రిస్కుతో కూడుకున్నవి. కాబట్టి అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం అనేది రిస్క్ తగ్గించడానికి ఉన్న ఓ మార్గం.


Click it and Unblock the Notifications