బంగారం, వెండి , స్టాక్స్, రియల్ ఎస్టేట్? 2026లో కాసుల కురిపించేది ఇదే!

2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ సామాన్యుల దగ్గర గతంలో కంటే కాస్త ఎక్కువ డబ్బు కనిపిస్తోంది. 2025లో ప్రభుత్వం కల్పించిన ఆదాయపు పన్ను ఊరట. రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు, జీఎస్టీ మార్పుల వల్ల మధ్యతరగతి జేబులో పొదుపు పెరిగింది. మరి ఈ అదనపు డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? వెండి వర్సె్స్ బంగారం (Silver vs Gold) మధ్య పోటీలో ఎవరు గెలుస్తారు? లేక స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలా? నిపుణుల విశ్లేషణ ఇప్పుడు చూద్దాం.

silver vs gold stocks real estate best investment options 2026 returns experts guide

వెండి (Silver): రిస్క్ ఎక్కువ.. రాబడి అంతకంటే ఎక్కువ!

గత ఏడాది వెండి ఏకంగా 150% పైగా లాభాలను ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), సోలార్ ప్యానెల్స్ వంటి పారిశ్రామిక అవసరాల వల్ల వెండికి విపరీతమైన డిమాండ్ ఉంది.

  • నిపుణుల సలహా: వెండిలో లాభాలు ఎంత వేగంగా వస్తాయో.. మార్కెట్ పడిపోయినప్పుడు నష్టాలు కూడా అంతే వేగంగా వస్తాయి. అందుకే మీ పోర్ట్‌ఫోలియోలో వెండిని 5% మించకుండా ఉంచుకోవాలని సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అభిషేక్ కుమార్ సూచిస్తున్నారు.

బంగారం (Gold): భద్రతకు కేరాఫ్ అడ్రస్!

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు అందరూ బంగారం వైపు చూస్తారు. కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకుంటుండటం, డాలర్ విలువ తగ్గడం పసిడికి కలిసి వచ్చే అంశాలు.

  • స్ట్రాటజీ: బంగారం భారీ లాభాలను ఇవ్వకపోవచ్చు కానీ, మీ పెట్టుబడికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనిలో 10% వరకు పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం.

స్టాక్ మార్కెట్ (Equities): గ్రోత్ కావాలంటే ఇదే దారి!

కంపెనీల లాభాలు పెరుగుతుంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటుంది. భారతదేశ ఆర్థిక మూలాలు బలంగా ఉండటంతో దీర్ఘకాలికంగా సంపదను సృష్టించడానికి ఈక్విటీలే సరైన మార్గం.

  • రిస్క్: వడ్డీ రేట్లు తగ్గితే మార్కెట్లకు బలం చేకూరుతుంది. అయితే ప్రస్తుతం మార్కెట్ వ్యాల్యూయేషన్లు ఎక్కువగా ఉండటంతో ఆచితూచి అడుగు వేయాలి.

రియల్ ఎస్టేట్: ఎప్పటికీ క్రేజ్ తగ్గని రంగం!

హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి తిరుగులేదు. 2026లో కూడా భూమి ధరలు 7-10% పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • రెంటల్ ఇన్‌కమ్: అద్దె రూపంలో వచ్చే ఆదాయం (Rental Yield) 2.5-4% వరకు ఉండవచ్చు. ఒకవేళ డైరెక్ట్ గా ప్లాట్లు లేదా ఇళ్లు కొనలేని వారు REITs (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్) ద్వారా కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.

ఏది బెస్ట్?

మొత్తంగా చూస్తే.. 2026లో ఏ ఒక్క ఆస్తిపైనే పూర్తి పెట్టుబడి పెట్టడం కంటే.. అన్నింటిలోనూ కొంచెం కొంచెం (Diversification) ఇన్వెస్ట్ చేయడం మేలని ట్రేడ్ జిని వంటి సంస్థల నిపుణులు చెబుతున్నారు. సంపద పెరగాలంటే స్టాక్స్, భద్రత కోసం బంగారం, భారీ లాభాల కోసం వెండి, స్థిరత్వం కోసం రియల్ ఎస్టేట్.. ఇలా మీ అవసరాలకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+