ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం లాగానే వెండి కూడా సేఫ్ పెట్టుబడిగా భావిస్తున్నారు చాలామంది. బంగారంతోపాటే ప్రపంచవ్యాప్తంగా వెండికి కూడా డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారంలో పెట్టుబడి పెట్టలేని వాళ్లు తర్వాతి ఆప్షన్ గా వెండి వైపు చూస్తున్నారు. అయితే వెండిలో ఇన్వెస్ట్ మెంట్ చేయడం కోసం సరైన ఆప్షన్ ఏది? డైరెక్ట్ గా ఫిజికల్ వెండిని కొనాలా? లేదా సిల్వర్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టాలా? ఇలా తెలుసుకోండి.
ఫిజికల్ వెండి అంటే..
వెండిని నేరుగా ఆభరణాల రూపంలో లేదా వెండి బార్లు, వెండి కడ్డీలు, సిల్వర్ కాయిన్స్ రూపంలో కొనుగోలు చేయడాన్ని ఫిజికల్ వెండిగా భావించొచ్చు.
బెనిఫిట్స్
- వెండిని ఫిజికల్ గా కొనుగోలు చేయడం వల్ల మీకు మీ వెండి మీ కళ్ల ముందే ఉంటుంది. మీ ఆస్తి ఏమైపోతుందో అన్న భయం ఉండదు
- ఫిజికల్ వెండి ఉండడం ద్వారా అత్యవసర సమయాల్లో తాకట్టు పెట్టుకోవడానికి లేదా గిఫ్ట్‌లు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది.
- నష్టాలు
- ఫిజికల్ గా వెండిని దాచుకోవడం వల్ల దొంగల భయం ఉండొచ్చు. కాబట్టి దాన్ని సురక్షితమైన లాకర్లలో దాచుకోవాల్సి వస్తుంది. అలాగే దానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
- వెండి ఆభరణాలను తిరిగి అమ్మాలంటే మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. అలాగే వాటి కొనుగోలుపై జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది.
- ఫిజికల్ వెండికి లిక్విడిటీ ఉండదు. అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు వెంటనే అమ్మి డబ్బు పొందడం కష్టం అవ్వొచ్చు.

silver etf అంటే..
ఈటీఎఫ్ అంటే ఎక్స్ చేంజ్ ట్రేడెట్ ఫండ్ (Exchange Traded Fund) అని అర్థం. ఇది స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అయ్యే ఫండ్. పెట్టుబడిదారుల డబ్బును వెండిలో పెట్టుబడి పెట్టి, ఆ వెండిని అత్యంత భద్రతతో కూడిన వాల్ట్‌లలో నిల్వ చేస్తారు.
బెనిఫిట్స్ ఇవే..
- ఇందులో లిక్విడిటీ ఉంటుంది. అంటే మీకు నచ్చినప్పుడు మీ యూనిట్లు అమ్ముకోవచ్చు లేదా కొనుగోలు చేయొచ్చు. వెంటనే డబ్బు మీ ఖాతాలోకి వస్తుంది.
- ఇందులో సేఫ్టీ ఇష్యూ ఉండదు. ఫిజికల్ వెండి లాగా ఇంట్లో దాచుకోవాల్సిన అవసరం లేదు.
- ఇందులో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. అలాగే సిప్ (SIP) రూపంలో క్రమంగా పెట్టుబడి పెట్టవచ్చు.
నష్టాలు
- silver etf లను కొనుగోలు చేయడానికి డీమ్యాట్ (Demat) అకౌంట్ కచ్చితంగా ఉండాలి.
- ఈ తరహా పెట్టుబడిలో మీ దగ్గర నిజమైన వెండి ఉండదు. కేవలం దాని విలువకు తగ్గ యూనిట్లు మాత్రమే ఉంటాయి.
ఏది ఎంచుకోవాలి?
పెరుగుతున్న వెండి ధరల నుంచి మీరు లాభం పొందాలనుకుంటే రెండింటిలో ఏ ఆప్షన్ అయినా ఎంచుకోవచ్చు. అయితే సులభంగా, తక్కువ ఖర్చుతో పెట్టుబడి పెట్టాలని భావిస్తే సిల్వర్ ETF సరైన ఎంపిక. ఒకవేళ మీరు ఇంట్లో నిజమైన వెండి ఉండాలని కోరుకుంటే అప్పుడు ఫిజికల్ వెండి కొనొచ్చు. ఇకపోతే ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, మీ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి. మీకు బాగా నమ్మకమున్న ఆర్థిక సలహాదారుని సంప్రదించడం ఉత్తమం. అలాగే పెట్టుబడి సమయంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ను పూర్తిగా చదివి నిర్ణయం తీసుకోవాలి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు భారీ ర్యాలీతో ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 15, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

ఐస్ క్రీం బండి మీద తక్కువ ధరకే బంగారం అమ్మకం.. విశాఖ బీచ్ వద్ద ఎగబడుతున్న కస్టమర్లు. .వీడియో ఇదిగో..

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

సముద్రం అడుగున సీక్రెట్ బంగారం ఫ్యాక్టరీ.. ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజం.. బట్టబయలు చేసిన సైంటిస్టులు..

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..



Click it and Unblock the Notifications