For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డు ఉందా? డేంజర్ జోన్‌లోకి వెళ్ళకుండా.. రివార్డ్ పాయింట్స్-రీడీమ్

|

క్రెడిట్ కార్డు సరైనవిధంగా ఉపయోగిస్తే ప్రయోజనకర ఆర్థిక సాధనం. నిర్ణీత కాలవ్యవధిలో మీకు వడ్డీరహిత కొనుగోలు శక్తిని అందిస్తుంది. రివార్డ్స్ కూడా ఉంటాయి. క్రెడిట్ కార్డును బాధ్యతాయుతంగా వినియోగిస్తే మీరు క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవడంలో సహాయపడుతుంది. అంతేకాదు, రుణాలు, ఇతర క్రెడిట్ కార్డ్స్ పైన మంచి ఆఫర్స్ పొందడంలో సహకరిస్తుంది. అంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తీసుకునే రుణాలపై వడ్డీ రేటు కూడా తగ్గే అవకాశముంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లులు సక్రమంగా చెల్లించకుంటే అది తడిసిమోపెడు అవుతుంది. ఫైనాన్స్ ఛార్జీలు చాలా అధికంగా ఉంటాయి. ఏడాదికి దాదాపు నలభై శాతం ఉంటుంది.

ఫైనాన్స్ ఛార్జీల షాక్

ఫైనాన్స్ ఛార్జీల షాక్

సాధారణంగా చాలామంది తమ క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించలేని పరిస్థితుల్లో కనీస మొత్తం 5 శాతమైన చెల్లించే ప్రయత్నం చేసి, లేట్ ఫీజు నుండి తప్పించుకుంటారు. కానీ అలా ఒకటికి మించి చేస్తే, ఇది మీ క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం చూపుతుంది. గడువులోగా కనీస మొత్తం ఐదు శాతం చెల్లించాక మీ క్రెడిట్ కార్డ్ పరిమితి మేరకు యాక్టివ్ అవుతుంది. అయినప్పటికీ మీ రుణం వేగంగా పెరగడానికి దారితీస్తుంది. రోజువారీగా చెల్లించని మొత్తంపై ఫైనాన్స్ ఛార్జీలు విధిస్తారు. క్రెడిట్ కార్డులపై ఫైనాన్స్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏడాదికి కొన్ని కార్డులపై 40 శాతం వరకు ఉంటుంది. కొన్ని కార్డుల విషయంలో తదుపరి ట్రాన్సాక్షన్స్‌కు ఫైనాన్స్ ఛార్జీలు వర్తిస్తాయి. మీరు మీ క్రెడిట్ కార్డు ఛార్జీలు చెల్లించనంత వరకు ఈ ఫైనాన్స్ ఛార్జీలు వర్తిస్తాయి.

ఏటీఎం నుండి నగదు ఉపసంహరణ

ఏటీఎం నుండి నగదు ఉపసంహరణ

ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేస్తే ఒకటి కాదు.. రెండు ఛార్జీలు వర్తిస్తాయి. నగదు ఉపసంహరణపై 3.5 శాతం వరకు నగదు అడ్వాన్స్ ఫీజులు, 23 శాతం-49 శాతం మధ్య అధిక ఫైనాన్స్ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు కూడా నగదును ఉపసంహరించిన రోజు నుండి చెల్లించే వరకు వర్తిస్తాయి. కాబట్టి మీరు మీ క్రెడిట్ కార్డు ద్వారా నగదును ఉపసంహరించుకుంటే అధిక ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. మీకు నిధుల కొరత ఉంటే మీ క్రెడిట్ కార్డు ద్వారా నగదు ఉపసంహరణ మీ చివరి ప్రయత్నంగా ఉండాలి. క్రెడిట్ కార్డు లేదా వ్యక్తిగత రుణంపై లోన్ ఎంచుకుంటే అది చౌకగా ఉంటుంది.

క్రెడిట్ కార్డుపై ఎక్కువగా ఆధారపడవద్దు

క్రెడిట్ కార్డుపై ఎక్కువగా ఆధారపడవద్దు

క్రెడిట్ కార్డు ఉంది కదా అని, క్రెడిట్ పైన ఎక్కువగా ఆధారపడితే ఇది మీ క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం చూపుతుంది. ఎప్పుడు కూడా గరిష్ట క్రెడిట్ పరిమితి వరకు ఉపయోగించడం వల్ల క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం ఉంటుంది. క్రెడిట్ కార్డు ఖర్చు లేదా కార్డు యుటిలైజేషన్ మీ క్రెడిట్ పరిమితిలో దాదాపు 40 శాతం వరకు ఉండేలా చూసుకోవాలి. మీరు ఎప్పటికీ 50 శాతం CUR దాటితే మీ క్రెడిట్ పరిమితిని పెంచమని మీ క్రెడిట్ కార్డు జారీదారుని కోరవచ్చు. మీకు సరిపోయే మరో క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి.

 గరిష్ట వ్యవధి

గరిష్ట వ్యవధి

ఇవే కాకుండా, మీ క్రెడిట్ కార్డు ఖర్చును వడ్డీరహిత గడువులోగా చెల్లించాలి. లేదంటే ఆ తర్వాత భారీగా ఛార్జీలు పడతాయి. సాధారణంగా ఇది కార్డును బట్టి 18 రోజుల నుండి 55 రోజుల వరకు ఉంటుంది. సకాలంలో చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. మీరు బిల్లింగ్ సైకిల్ ప్రారంభంలో కొనుగోలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే గడువు ఎక్కువగా ఉంటుంది. ఒకటికి మించి క్రెడిట్ కార్డ్స్ ఉంటే మీ ఖర్చును వివిధ కార్డ్స్‌కు విస్తరించడం ద్వారా గరిష్ట వడ్డీ రహిత వ్యవధిని పొందవచ్చు.

రివార్డ్ పాయింట్స్ రీడీమ్

రివార్డ్ పాయింట్స్ రీడీమ్

క్రెడిట్ కార్డు జారీదారులు ఎక్కువగా రివార్డ్ పాయింట్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. మీ కార్డు జారీ చేసేవారు రివార్డ్ పాయింట్స్ ప్రోగ్రాం ఆధారంగా మీ భవిష్యత్తు కొనుగోళ్లపై మీరు సంపాదించిన రివార్డ్ పాయింట్స్‌ను రిడీమ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లను ఎయిర్ మైల్స్ లేదా హోటల్ వోచర్స్ వంటి ప్రయోజనాలకు మార్చుకోవచ్చు. లేదా బాకీ ఉన్న బిల్లుకు అనుగుణంగా సర్దుబాటు చేయవచ్చు. అయితే ఈ రివార్డ్ పాయింట్స్ రెండు నుండి మూడేళ్ల చెల్లుబాటును కలిగి ఉంటాయి. అందుకే రివార్డ్ పాయింట్స్ ట్రాక్, రిడీమ్ చేయడం అవసరం. వీటిని విస్మరించవద్దు.

English summary

క్రెడిట్ కార్డు ఉందా? డేంజర్ జోన్‌లోకి వెళ్ళకుండా.. రివార్డ్ పాయింట్స్-రీడీమ్ | Signs that show your credit card usage is entering danger zone

A Credit Card is a useful financial tool that not only provides you with better purchasing power through an interest-free period, but also helps you earn rewards and perks.
Story first published: Wednesday, January 19, 2022, 16:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X