దారుణంగా పతనమవుతున్న పేటీఎం షేర్, ఈ స్టాక్ కొనుగోలు చేయవచ్చా?
పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ స్టాక్ లిస్టింగ్ నేడు నేటి వరకు భారీగా నష్టపోయింది. ప్రస్తుతం (ఫిబ్రవరి 8, 2022) పేటీఎం స్టాక్ రూ.1000కి దిగువనే ఉంది. నవంబర్ 18వ తేదీన లిస్టింగ్ అయింది. ఈ స్టాక్ దాదాపు ఏ దశలోను కోలుకోలేదు. అంతకంతకూపడిపోయి ఇప్పుడు రూ.945 స్థాయిలో ఉంది. లిస్టింగ్ రోజు నుండి చూస్తే దాదాపు సగం పడిపోయింది. ఇష్యూ ధరతో పోలిస్తే అంతకంటే మించి క్షీణించింది. పేటీఎం ఇష్యూ ధర రూ.2150. కానీ నాడు రూ.1950 వద్ద లిస్ట్ అయింది. నేడు సగం పడిపోయింది.

భారీగా నష్టపోయింది కానీ...
లిస్టింగ్ తేదీ నుండి పేటీఎం స్టాక్ 40 శాతం లేదా రూ.616 క్షీణించింది. నెల రోజుల్లో 19 శాతం లేదా రూ.215 క్షీణించింది. గత ఐదు సెషన్‌లలో 4 శాతం లేదా రూ.40 తగ్గింది. ఈ రోజు కూడా దాదాపు రెండు శాతం మేర లేదా రూ.17 క్షీణించి రూ.940 వద్ద ట్రేడ్ అయింది. పేటీఎం అడపాదడపా కోలుకున్నప్పటికీ, పూర్తిగా మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడూ కోలుకోలేదు. అయితే ఈ స్టాక్ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశముందని రేటింగ్ సంస్థలు చెబుతున్నాయి.

ఈ స్టాక్ జంప్ చేయవచ్చు
ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మన్ శాక్స్ నిపుణులు ఈ స్టాక్ పుంజుకుంటుందని చెబుతున్నారు. పేటీఎం డిసెంబర్ త్రైమాసికం ఆదాయం భారీగా పెరిగింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు టార్గెట్ ధర రూ.1460గా అంచనా వేస్తోంది గోల్డ్‌మన్ శాక్స్. గతంలో న్యూట్రల్‌గా పేర్కొన్న ఈ స్టాక్‌ను ఇప్పుడు కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. ఈ స్టాక్ 53 శాతం లాభపడవచ్చునని అంచనా వేస్తోంది. బుల్ సినారియో ప్రకారం రూ.2090, బియర్ సినారియో రూ.820గా పేర్కొంటున్నారు. అంటే ఈ స్టాక్ దీర్ఘకాలంలో 119 శాతం రిటర్న్స్ కూడా ఇవ్వవచ్చునని అంచనా.

సిఫార్స్
ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని గతంలో కేవలం కొన్ని రేటింగ్ సంస్థలు మాత్రమే సిఫార్స్ చేయగా, ఇప్పుడు ఈ సంఖ్య పెరిగింది. ఈ ఏడాది దారుణ ప్రదర్శన కలిగిన ఐపీవోలలో పేటీఎం ముందు ఉంటుంది. కానీ మున్ముందు పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత జొమాటో కూడా అత్యంత దారుణ ప్రదర్శనను కనబరిచింది.


Click it and Unblock the Notifications