market news: సాధారణంగా పిల్లలకు తల్లిదండ్రులు వివిధ రకాల గిఫ్టులు ఇస్తూ ఉంటారు. ఇది సహజమే కానీ షేర్లు బహుమతిగా కట్టబెట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా..? స్థిరాస్థిని ఇస్తున్న మాదిరిగానే స్టాక్స్ సైతం గిఫ్ట్‌గా ఇవ్వచ్చు మరియు తీసుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56 ప్రకారం ఒక వ్యక్తి అందుకున్న స్థిర చరాస్తి, ఏదైనా ద్రవ్య బహుమతిపై ట్యాక్స్ విధించబడుతుంది. ఒక ఏడాదిలో అందుకున్న గిఫ్ట్స్ మొత్తం విలువ 50 వేల కంటే ఎక్కువ ఉంటే దానిపై పన్ను విధిస్తారు. అయితే బంధువుల నుంచి వచ్చిన బహుమతులతో పాటు ఇతరవాటికి నిర్దిష్ట మినహాయింపులు ఉన్నాయని గమనించాలి.

ఓ వ్యక్తి జీవిత భాగస్వామి, సోదరుడు లేదా సోదరి, జీవిత భాగస్వామి సోదరుడు లేదా సోదరి, తల్లిదండ్రుల సోదరుడు లేదా సోదరి, వారసులు వంటి వారిని ఆదాయపు పన్ను విభాగం ప్రకారం చట్టబద్ధ బంధువులుగా గుర్తిస్తారు. అంటే కుమార్తెకు షేర్లు లేదా డబ్బు బదిలీ చేయడం వల్ల ఆమెకు పన్ను విధించబడదు.
షేర్లను విక్రయించిన అనంతరం వచ్చిన సొమ్మును కుమారుడు లేదా కుమార్తెకు బహుమతిగా ఇచ్చినట్లయితే ఆ మూలధన లాభాలపై 10 శాతం పన్ను సేకరించబడుతుంది. అదే డైరెక్టుగా షేర్లను ఇచ్చినట్లయితే, వారు వాటిని విక్రయించాలని నిర్ణయించుకున్నప్పుడు ట్యాక్స్ వేస్తారు. దీన్నిబట్టి చూస్తే నగదుగా మార్చడం కంటే నేరుగా షేర్లను గిఫ్ట్‌గా ఇవ్వడమే ఉత్తమ మార్గంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications