సావెరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇన్వెస్టర్ల పంట పండింది. 2020లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సావెరిన్ గోల్డ్ బాండ్స్ సిరీస్ VIII కు ఐదేళ్లు పూర్తవడంతో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్లకు సంబంధించిన ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధరను అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా అప్పట్లో పెట్టుబడి పెట్టిన వారికి భారీగా లాభాలు వచ్చాయి.
ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సిరీస్‌కు ఒక్క యూనిట్‌కు, అంటే ఒక గ్రాము బంగారానికి ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధరను రూ.14,432గా నిర్ణయించింది. ఇది ప్రస్తుత అంతర్జాతీయ, దేశీయ బంగారం ధరలను ప్రతిబింబించేలా నిర్ణయించిన రేటుగా చెప్పవచ్చు. ఐదేళ్ల క్రితం తక్కువ ధరలకు బంగారం కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు ఇది ఎంతో లాభదాయకంగా మారింది.

జనవరి 21, 2020న కేంద్ర ప్రభుత్వం సావెరిన్ గోల్డ్ బాండ్స్ సిరీస్ VIII ను విడుదల చేసింది. ఆ సమయంలో ఆన్‌లైన్ ద్వారా బాండ్లు కొనుగోలు చేసిన వారికి గ్రాము బంగారానికి రూ.3,966గా ధర నిర్ణయించగా.. ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి రూ.4,016గా నిర్ణయించారు. ఆన్‌లైన్ కొనుగోలుపై రూ.50 డిస్కౌంట్ ఇచ్చారు. అప్పట్లో ఉన్న బంగారం ధరలతో పోలిస్తే ఇది చాలా అనుకూలమైన రేటు కావడంతో చాలామంది ఇన్వెస్టర్లు ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టారు.
ఇప్పుడు ప్రకటించిన రిడెంప్షన్ ధరను కొనుగోలు ధరతో పోల్చి చూస్తే లాభాల రేటు భారీగాప పెరిగింది. ఆన్‌లైన్‌లో గ్రాముకు రూ.3,966 పెట్టి కొనుగోలు చేసినవారికి ప్రస్తుతం గ్రాముకు రూ.14,432 లభిస్తోంది. అంటే ఒక్క గ్రాముపై రూ.10,466 లాభం వచ్చింది. ఐదేళ్ల వ్యవధిలో Gold ధర దాదాపు మూడింతలు పెరగడం వల్ల ఈ స్థాయి రాబడి సాధ్యమైంది. అప్పట్లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఇప్పుడు సుమారు రూ.3.64 లక్షలు వస్తాయి. ఇది కేవలం బంగారం ధర పెరుగుదల వల్ల వచ్చిన లాభమేనని చెప్పవచ్చు.
ఈ రిడెంప్షన్ ధరను ఆర్బీఐ యాదృచ్ఛికంగా నిర్ణయించలేదు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించిన గోల్డ్ ధరలను ఆధారంగా తీసుకుని, జనవరి 16, 19, 20 తేదీల్లో ఉన్న మూడు బిజినెస్ డేస్‌ల క్లోజింగ్ ధరల సింపుల్ యావరేజ్‌ను లెక్కించి ఈ రేటును ఖరారు చేసింది. ఇదే విధానం అన్ని సావెరిన్ గోల్డ్ బాండ్స్ రిడెంప్షన్‌కు అనుసరిస్తారు.
బంగారం ధర లాభంతో పాటు ఈ బాండ్లపై అదనంగా వడ్డీ ప్రయోజనం కూడా ఉంటుంది. సావెరిన్ గోల్డ్ బాండ్స్‌పై ప్రతి సంవత్సరం 2.5 శాతం వడ్డీని ఆర్బీఐ చెల్లిస్తుంది. ఈ వడ్డీని ఏడాదికి రెండుసార్లు, అంటే సెమి-యాన్యువల్‌గా.. ఇన్వెస్టర్ల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా క్రెడిట్ చేస్తారు. ఇది భౌతిక బంగారం లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే ఎస్‌జీబీలకు ఉన్న ప్రధాన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
సాధారణంగా సావెరిన్ గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ కాలం ఎనిమిదేళ్లు ఉంటుంది. అయితే ఐదేళ్లు పూర్తైన తర్వాత వడ్డీ చెల్లింపు తేదీల్లో ప్రీమెచ్యూర్ రిడెంప్షన్‌కు అవకాశం ఇస్తారు. అంటే పూర్తిగా ఎనిమిదేళ్లు వేచి ఉండకుండానే అవసరమైతే బాండ్లను విమోచించుకోవచ్చు. ఇందుకోసం ఇన్వెస్టర్లు తమ బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ లేదా డీమ్యాట్ అకౌంట్ ద్వారా స్టాక్ బ్రోకర్‌ను సంప్రదించి రిడెంప్షన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
సావెరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏమిటి ? సావెరిన్ గోల్డ్ బాండ్ అనేది కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే బంగారంతో అనుసంధానమైన పెట్టుబడి పథకం. భౌతిక బంగారం కొనుగోలు చేయకుండా, బంగారం ధరల పెరుగుదల లాభాన్ని పొందే అవకాశం ఇందులో ఉంటుంది. ఈ బాండ్లు గ్రాముల ఆధారంగా జారీ చేయబడతాయి.
సాధారణంగా ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ కాలం ఉండగా, ఐదేళ్ల తర్వాత ముందస్తు రిడెంప్షన్‌కు అవకాశం ఉంటుంది. బంగారం ధర లాభంతో పాటు ప్రతి సంవత్సరం 2.5 శాతం వడ్డీ కూడా ఇన్వెస్టర్లకు లభిస్తుంది. పన్ను ప్రయోజనాలు, భద్రత, నిల్వ సమస్యలు లేకపోవడం వల్ల సావెరిన్ గోల్డ్ బాండ్లు దీర్ఘకాలిక పెట్టుబడిగా మంచి ఎంపికగా పెట్టుబడిదారులు భావిస్తారు.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications