Fixed Deposits: సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులు ఇవే..!
సీనియర్ సిటిజన్లు ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై 8.50% వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తున్న బ్యాంకులు ఉన్నాయి. ఇందులో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి. మార్కెట్‌లోనే అత్యంత ఆకర్షణీయమైన రాబడులను అందిస్తున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ, విదేశీ బ్యాంకులు కూడా అధిక FD రేట్లను అందిస్తున్నాయి. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.90 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.60 శాతం, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.60 శాతం, నా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.30 శాతం అందిస్తున్నారు.

శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.30 శాతం, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.00 శాతం, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ FD వడ్డీ రేట్లు పరిశీలిస్తే ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.75 శాతం, యెస్ బ్యాంక్ 7.75 శాతం, IDFC ఫస్ట్ బ్యాంక్ 7.50 శాతం,
కర్ణాటక బ్యాంక్ 7.40 శాతం, ICICI బ్యాంక్ 7.10 శాతం, HDFC బ్యాంక్ 7.10 శాతం, యాక్సిస్ బ్యాంక్ 7.25 శాతం, బంధన్ బ్యాంక్ 7.95 శాతం, CSB బ్యాంక్ 7.35 శాతం, సిటీ యూనియన్ బ్యాంక్ 7.50 శాతం, DBS బ్యాంక్ 7.35 శాతం, DCB బ్యాంక్ 8.00 శాతం ధనలక్ష్మి బ్యాంక్ 7.75 శాతం, ఫెడరల్ బ్యాంక్ 7.20 శాతం, IDBI బ్యాంక్ 7.00 శాతం, J&K బ్యాంక్ 7.55 శాతం,
కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30 శాతం, కరూర్ వైశ్య బ్యాంక్ 7.20 శాతం, నైనిటాల్ బ్యాంక్ 7.10 శాతం, RBL బ్యాంక్ 7.70 శాతం, సౌత్ ఇండియన్ బ్యాంక్ 7.30 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి.
ప్రభుత్వ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అందిస్తున్ వడ్డీ రేట్లు పరిశలిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా 7.25 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.45 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.15 శాతం,
కెనరా బ్యాంక్ 7.10 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25 శాతం, ఇండియన్ బ్యాంక్ 7.15 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7.10 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10 శాతం,
పంజాబ్ & సింద్ బ్యాంక్ 7.35 శాతం,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.05 శాతం, యూకో బ్యాంక్ 6.95 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.05 శాతం వడ్డీ రేట్లు చెల్లిస్తున్నాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకులు డిఫాల్ట్ అయితే రూ.5 లక్షల బీమా సొమ్మ వస్తుంది. మీరు రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఒక వేళ బ్యాంకు డిఫాల్ట్ అయితే మీకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే వస్తాయి. అందుకే వడ్డీ రేటు కాకుండా భద్రత కూడా చూసుకోవాలి. లేదంటే పెద్ద మొత్తంలో కాకుండా రెండు లేదు మూడు బ్యాంకుల్లో ఎఫ్డీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications