Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఉన్నాయంటే..!
సీనియర్ సిటిజన్లు తమ పెట్టుబడులు సురక్షితమైన పథకాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు చూస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్ల మంచి ఎంపిక అవుతుందని సూచిస్తున్నారు.
ఫిక్స్డ్ డిపాజిట్లలో (FDలలో) పెట్టుబడి పెడితే పలు బ్యాంకులలో 8.60 శాతం వరకు వడ్డీని పొందే అవకాశం ఉంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అత్యధిక వడ్డీ రేట్లను చెల్లిస్తున్నాయి. వీటిలో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అగ్రస్థానంలో ఉండగా, దాని తర్వాత సూర్యోదయ, ఈక్విటాస్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా మంచి వడ్డీ రేట్లే అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ, విదేశీ బ్యాంకులు కాస్త తక్కువ వడ్డీ రేట్లను చెల్లిస్తున్నాయి.
అధిక రాబడులు పొందాలనుకునే సీనియర్ సిటిజన్లకు, వివిధ బ్యాంకులు, కాలపరిమితుల FD రేట్లను పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్లలో చిన్న తేడా కూడా మెచ్యూరిటీ మొత్తంలో గణనీయమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల పెద్ద డిపాజిట్లపై ఇది ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులు పరిశీలిస్తే.. అందులో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.60 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిసోంది.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.30 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.90 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. డీసీబీ బ్యాంక్ 8.00 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది.
బంధన్ బ్యాంక్ 7.95 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తుండగా.. ఇండస్ఇండ్ బ్యాంక్ 7.75 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది.యెస్ బ్యాంక్ 7.75 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 7.35 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుండగా..
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.20 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.10 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.45 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తోంది.
పంజాబ్ & సింధ్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.35 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తుండగా.. ఇండియన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.30 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.10 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. కెనరా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.10 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్‌పై 7.05 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.10 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తుండగా...
డాయిష్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.00 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications