Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకులు ఇవే..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంచిన తర్వాత పలు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచాయి. అయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తుండగా.. వాటి తర్వాత ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ గరిష్టంగా 6.8 శాతం వడ్డీని ఇస్తుండగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ గరిష్టంగా 6.6 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 6.55 శాతం వడ్డీ చెల్లిస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రత్యేక 500 రోజుల ఎఫ్డీ పథకంపై 6.85 శాతం వడ్డీని అందిస్తుండగా.. ఎస్బీఐ కొన్ని నిర్దిష్ట కాలపరిమితులపై గరిష్టంగా 6.45 శాతం వడ్డీని అందిస్తోంది.

పెద్ద బ్యాంకులు సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లను ఇస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అక్టోబర్-డిసెంబర్ 2026 కాలానికి పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు రేట్లు మారలేదు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధి యోజన (SSY) వర్తించే నిబంధనలు, షరతులు, అర్హతకు లోబడి 8.2 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. FDని ఎంచుకునేటప్పుడు అధిక వడ్డీ రేట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదని గమనించండి. భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

Fixed Deposit

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సాధారణ డిపాజిటర్లకు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 8.25 శాతం వడ్డీ అందిస్తుండగా అదే కాలపరిమితిపై సీనియర్ సిటిజన్లు 8.60 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడు సంవత్సరాల ఒక రోజు నుంచి మూడు సంవత్సరాల ఆరు నెలల వరకు కాలపరిమితి గల డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 8.10 శాతం వరకు వడ్డీ చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 8.60 శాతం వరకు అందిస్తోంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రత్యేక 666-రోజుల డిపాజిట్‌పై సాధారణ డిపాజిటర్లకు 8.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం అందిస్తోంది.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ డిపాజిటర్లకు 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు పెట్టుబడిదారులకు అధిక ఎఫ్డీ రాబడులను అందిస్తాయి. అయినప్పటికీ, పెట్టుబడిదారులు రాబడులను భద్రత, లిక్విడిటీ, కాలపరిమితితో సమతుల్యం చేసుకోవాలి. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) ప్రతి డిపాజిటర్‌కు ప్రతి బ్యాంకులో రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు అసలు, వడ్డీతో సహా భీమా కల్పిస్తుందని కూడా గుర్తుంచుకోవాలి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+