Fixed Deposits: సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల 8.5 శాతం వడ్డీ రేట్లు చెల్లిస్తున్న బ్యాంకులు ఇవే..!
సురక్షితమైన, కచ్చితమైన రాబడి ఇచ్చే పథకాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ఒకటి. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాలపరిమితులను బట్టి వడ్డీ రేటు ఉంటుంది. పలు బ్యాంకులు సీనియర్ సీటిజన్లకు 8.5 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. అనేక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుండగా, ప్రైవేట్ బ్యాంకులు 8 శాతం వరకు, ప్రభుత్వ రంగ బ్యాంకులు 7.45 శాతం వరకు, విదేశీ బ్యాంకులు 7.10 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లు వివిధ బ్యాంకుల రేట్లను పోల్చి చూసి, సరైన కాలపరిమితిని ఎంచుకోవడం ద్వారా, పెట్టుబడిపై తక్కువ రిస్క్‌తో గరిష్ట వడ్డీ ఆదాయాన్ని పొందవచ్చు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం వరకు ఎఫ్డీ వడ్డీ రేట్లను చెల్లిస్తోంది.సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.50 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.30 శాతం వరకు FD వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.30 శాతం వరకు FD వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వరకు FD వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25 శాతం వరకు FD వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది.

డీసీబీ బ్యాంక్ 8.00 శాతం వరకు FD వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. బంధన్ బ్యాంక్ 7.95 శాతం వరకు FD వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.75 శాతం వరకు FD వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది.
యెస్ బ్యాంక్ 7.75 శాతం వరకు FD వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 7.35 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.15 శాతం వరకు FD వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది.
HDFC బ్యాంక్ 7.10 శాతం వరకు FD వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుండగా.. ICICI బ్యాంక్ 7.10 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. ప్రభుత్వ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.45 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్సడ్ డిపాజిట్లపై 7.25 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. ఇండియన్ బ్యాంక్ 7.15 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. కెనరా బ్యాంక్ 7.10 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఇస్తోంది. ఇండియన్ ఓవర్ సిస్ బ్యాంక్ 7.10 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.05 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిస్తోంది.
యూనియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.05 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 7.10 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. HSBC Bank 6.00 శాతం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. ఎఫ్డీ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో కాకుండా.. రూ. 5 లక్షల బీమా రక్షణ పరిధిలో ఉండేలా డిపాజిట్లను వివిధ బ్యాంకుల్లో విభజించుకోవడం మంచిది. అధిక రాబడి కోసం ఎంపిక చేసిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను వినియోగించుకోవడం, నగదు అవసరాలకు అనుగుణంగా డిపాజిట్ కాలపరిమితిని నిర్ణయించుకోవడం వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
