Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 8.25 శాతం వడ్డీని అందిస్తున్న బ్యాంకు ఇదే..!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్ 7న జరిగిన తన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచి, 5.25 శాతం నుంచి 5.50 శాతానికి చేర్చింది. ఈ పెంపు నేపథ్యంలో బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని బ్యాంకులు RBI విధాన ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే తమ FD రేట్లను సవరించవచ్చు. మరికొన్ని బ్యాంకులు అలా చేయడానికి కొన్ని వారాల సమయం తీసుకోవచ్చు. ఈ నిర్ణయం తీసుకునే సమయం, ఆయా బ్యాంకుల నిధుల అవసరాలు, ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) స్థితిపై ఆధారపడి ఉంటుంది.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 8.25 శాతం వడ్డీని అందిస్తోంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్టంగా 8.10 శాతం వడ్డీని అందిస్తోంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్టంగా 8.00 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్టంగా 8.00 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్టంగా 8.00 శాతం వడ్డీని చెల్లిస్తోంది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్టంగా 8.00 శాతం వడ్డీని అందిస్తోంది.

ప్రైవేట్ బ్యాంకుల విషయనికొస్తే.. SBM బ్యాంక్ ఇండియా గరిష్టంగా 7.65 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. DCB బ్యాంక్ గరిష్టంగా 7.50 శాతం వడ్డీని చెల్లిస్తోంది. యెస్ బ్యాంక్ గరిష్టంగా 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. IDFC ఫస్ట్ బ్యాంక్ గరిష్టంగా 7.10 శాతం వడ్డీని చెల్లిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ గరిష్టంగా 6.65 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఐడీబీఐ బ్యాంక్ గరిష్టంగా 6.55 శాతం వడ్డీని ఇస్తుంది.
యాక్సిస్ బ్యాంక్ గరిష్టంగా 6.50 శాతం వడ్డీని చెల్లిస్తోంది. హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ గరిష్టంగా 6.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ గరిష్టంగా 6.50 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
ప్రభుత్వ బ్యాంకుల్లో ఎఫ్డీ రేట్లను పరిశీలిస్తే.. బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. పంజాబ్ & సింధ్ బ్యాంక్ 6.85 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 6.75 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఇస్తోంది. ఇండియన్ బ్యాంక్ 6.65 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. కెనరా బ్యాంక్ 6.60 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.60 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.55 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఇస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.45 శాతం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది.
రూ. 5 లక్షల బీమా పరిధిలోనే ఉండేందుకు డిపాజిట్లను పలు బ్యాంకుల్లో ఎఫ్డీ చేయాలని నిపుణులు చెబుతున్నారు. అధిక రాబడుల కోసం ఎంపిక చేసిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను పెట్టాలన్నారు. ద్రవ్య అవసరాలకు అనుగుణంగా డిపాజిట్ కాలపరిమితులను సర్దుబాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications