Fixed Deposits: 555 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులు ఇవే..!

మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన రాబడిని కోరుకునే పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) ఉత్తమమైన ఎంపికగా ఉన్నాయి. వివిధ బ్యాంకులు, కాలపరిమితుల ఆధారంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. సాధారణ FDలతో పోలిస్తే ప్రత్యేక FDలు కొన్నిసార్లు మరింత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అటువంటి కాలపరిమితుల్లో 555 రోజుల కాలపరిమితి ఒకటిగా ఉంది. దీనిపై కొన్ని బ్యాంకులు ప్రస్తుతం సాధారణ పౌరులకు 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇదే కాలపరిమితిపై సీనియర్ సిటిజన్లు 7.50 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. సిటీ యూనియన్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకుల తాజా 555 రోజుల FDపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.

Fixed Deposits

సిటీ యూనియన్ బ్యాంక్
సిటీ యూనియన్ బ్యాంక్ 555 రోజుల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 7.25% వడ్డీ రేటును అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లు ఇదే కాలపరిమితిపై 7.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

కర్ణాటక బ్యాంక్
కర్ణాటక బ్యాంక్ 555 రోజుల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 7 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుండగా.. సీనియర్ సిటిజన్లు 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ఇండియన్ బ్యాంక్
ఇండియన్ బ్యాంక్ 555 రోజుల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.65% వడ్డీ రేటును అందిస్తుంది. ఇదే ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్లు 7.15% అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 555 రోజుల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.55% వడ్డీ రేటును ఆఫర్ చేస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు ఈ రేటు 7.05 శాతం వడ్డీ చెల్లిస్తోంది.

కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ తన 555 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.60 శాతం వడ్డీ రేటును అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 7.10% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ పౌరులకు 555 రోజుల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75% వడ్డీ రేటును ఆఫర్ చేస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంకు 7.25% వడ్డీ రేటును చెల్లిస్తోంది.

60 ఏళ్ల లోపు వయస్సు గల సాధారణ పౌరుల విషయంలో ఒక ఆర్థిక సంవత్సరంలో పొందిన మొత్తం వడ్డీ ఆదాయం రూ. 50,000 దాటినప్పుడు వడ్డీపై TDS వర్తిస్తుందని గుర్తించుకోవాలి. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్షగా ఉంటుంది. సంబంధిత TDS నిబంధనల పరిధిలోకి వచ్చే మొత్తం వడ్డీ ఆదాయానికి ఈ పరిమితులు వర్తిస్తాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+