దేశవ్యాప్తంగా పెరుగుతున్న రుణాలతో పాటుగా ఈఎంఐ భారం నేపథ్యంలో.. లోన్‌ను ముగించే మార్గాలపై అవగాహన చాలా అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోన్ సెటిల్‌మెంట్, ఫోర్‌క్లోజర్, లోన్ క్లోజర్ అనే మూడు పదాలు వినిపించినా, వాటి మధ్య ఉన్న తేడాలు, సిబిల్ స్కోర్‌పై పడే ప్రభావం చాలామందికి స్పష్టంగా ఉండటం లేదు. ఈ మూడు మార్గాలు భవిష్యత్‌లో లోన్‌లు, క్రెడిట్ కార్డులు పొందడంపై నేరుగా ప్రభావం చూపుతాయి.
లోన్ క్లోజర్: ఇది రుణగ్రహీత తీసుకున్న మొత్తాన్ని, వడ్డీతో సహా అన్ని ఈఎంఐలను సకాలంలో చెల్లించి, బ్యాంక్‌కు ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా లోన్‌ను పూర్తిగా ముగించడం. ఇది అత్యంత ఉత్తమమైన మార్గంగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. లోన్ క్లోజర్ జరిగినప్పుడు, క్రెడిట్ రిపోర్ట్‌లో Closed లేదా Fully Paid అని నమోదు అవుతుంది. దీని వల్ల CIBIL Score మెరుగుపడుతుంది. భవిష్యత్‌లో హోమ్ లోన్, కార్ లోన్ వంటి పెద్ద రుణాలు సులభంగా మంజూరు కావడానికి ఇది సహాయపడుతుంది.

ఫోర్‌క్లోజర్: నిర్ణయించిన కాలానికి ముందే లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించడం. ఉదాహరణకు 5 సంవత్సరాల లోన్‌ను 3 సంవత్సరాల్లోనే పూర్తిగా తీర్చడం ఫోర్‌క్లోజర్‌గా పరిగణిస్తారు. కొన్ని బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు ఫోర్‌క్లోజర్ ఛార్జీలు వసూలు చేస్తాయి. అయితే సిబిల్ స్కోర్ పరంగా చూస్తే ఫోర్‌క్లోజర్ కూడా సాధారణంగా పాజిటివ్‌గానే ఉంటుంది. సమయానికి లోన్ తీర్చినట్టు క్రెడిట్ చరిత్రలో నమోదు కావడంతో, స్కోర్‌పై ప్రతికూల ప్రభావం ఉండదు.
లోన్ సెటిల్‌మెంట్: లోన్ సెటిల్‌మెంట్ పూర్తిగా భిన్నమైన మార్గం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రుణగ్రహీత మొత్తం లోన్ చెల్లించలేని పరిస్థితిలో.. బ్యాంక్‌తో చర్చించి, లోన్ మొత్తంలో ఒక భాగాన్ని మాత్రమే చెల్లించి మిగతా మొత్తాన్ని మాఫీ చేయించుకోవడం సెటిల్‌మెంట్. ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా, దీర్ఘకాలంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. క్రెడిట్ రిపోర్ట్‌లో Settled అని నమోదు అవుతుంది. ఇది సిబిల్ స్కోర్‌ను భారీగా తగ్గిస్తుంది. కొన్నిసార్లు 75 నుంచి 150 పాయింట్ల వరకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
లోన్ సెటిల్‌మెంట్ చేసిన వ్యక్తులకు భవిష్యత్‌లో కొత్త లోన్‌లు, క్రెడిట్ కార్డులు పొందడం కష్టమవుతుంది. ముఖ్యంగా హోమ్ లోన్ లాంటి పెద్ద రుణాలకు బ్యాంకులు నిరాకరించే అవకాశం ఎక్కువ. సెటిల్‌మెంట్ స్టేటస్ క్రెడిట్ రిపోర్ట్‌లో ఏడేళ్ల వరకు కనిపించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్లుప్తంగా చెప్పాలంటే లోన్‌ను ముగించేటప్పుడు తక్షణ ప్రయోజనాలకన్నా, దీర్ఘకాల ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంతవరకు లోన్ క్లోజర్ లేదా ఫోర్‌క్లోజర్ మార్గాన్నే ఎంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. లోన్ సెటిల్‌మెంట్‌కు వెళ్లకపోవడం మేలని వారు స్పష్టం చేస్తున్నారు. సిబిల్ స్కోర్ ఒక వ్యక్తి ఆర్థిక విశ్వసనీయతకు అద్దం లాంటిదని, దాన్ని కాపాడుకోవడం భవిష్యత్ ఆర్థిక భద్రతకు కీలకమని నిపుణులు గుర్తు చేస్తున్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications