స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. మంగళవారం కాస్త వెనక్కి తగ్గిన సూచీలు నేడు మరింతగా నష్టపోయాయి. ఇటీవలి గరిష్ఠాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. ఒక్క టెలికాం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడాయి. ఐరోపా సూచీలు కూడా మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ 18300 డాలర్ల దిగువకు పడిపోయింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు క్షీణించాయి. హిండాల్కో, టైటాన్, HUL, బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్ భారీగా నష్టపోయాయి.

టాప్ లూజర్స్, గెయినర్స్
సెన్సెక్స్ నేటి ఉదయం 61,800.07 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,880.36 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి, 61,109.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,439.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,458.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,209.35 పాయింట్ల వద్ద కనిష్టాన్నితాకింది. సెన్సెక్స్ చివరకు 456.09 (0.74%) పాయింట్లు నష్టపోయి 61,259.96 పాయింట్ల వద్ద, నిఫ్టీ 152.15 (0.83%) పాయింట్లు క్షీణించి 18,266.60 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో 21 నష్టపోయాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్ 4.02 శాతం, SBI 2.40 శాతం, టాటా మోటార్స్ 1.04 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.64 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.39 శాతం ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో 3.90 శాతం, టైటాన్ కంపెనీ 2.96 శాతం, HUL 2.68 శాతం, BPCL 2.64 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.48 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఎస్బీఐ, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, హెచ్‌యూఎల్ ఉన్నాయి.

ర్యాలీ చేసిన స్టాక్స్
నేడు మార్కెట్లు నష్టపోయినప్పటికీ పలు స్టాక్స్ 15 శాతం కంటే పైగా ర్యాలీ చేశాయి. నిఫ్టీ 50 స్టాక్స్‌లో 11 స్టాక్స్ లాభపడగా, 39 నష్టపోయాయి. 15 శాతం కంటే ఎక్కువగా లాభపడిన స్టాక్స్‌లో అరిహంత్ ఫౌండ్(20.0%), గెన్సాల్ ఇంజ్(20.0%), ట్రాన్సుపోర్ట్ కార్ప్(19.17%), ఉగ్రో క్యాపిటల్ (17.93%), సుడాల్ ఇండ్స్(15.19%) ఉన్నాయి. ఇందులో పలు స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. అదే సమయంలో కపిల్ రాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్, టెక్సేల్ ఇండ్, జాయ్ రియాలిటీ వంటివి 52 వారాల కనిష్టాన్ని తాకాయి.

రెండింతల లాభం
స్టాక్ మార్కెట్లు అప్పుడప్పుడు నష్టపోతున్నప్పటికీ ఎప్పటికప్పుడు గరిష్టాలకు చేరుకుంటున్నాయి. గత ఏడాది (2020) మార్చి నెలలో సూచీలు దారుణంగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 26వేల దిగువకు పడిపోయింది. అయితే క్రమంగా కోలుకుంది. నిన్న ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ప్రస్తుతం మార్చి 2020 భారీ డిప్‌తో పోలిస్తే 250 శాతం లాభపడింది. మార్చి 24, 2020వ తేదీన 25,000 స్థాయిలో ఉన్న సెన్సెక్స్ ఈ కాలంలో 37,000 పాయింట్లు ఎగిసి 62,000కు చేరుకుంది. మరో ఆసక్తికర అంశం ఏమంటే నాటి నుండి బీఎస్ఈ500లో 72 శాతం స్టాక్స్ మల్టీ బ్యాగర్స్‌గా నిలిచాయి. ఇందులో 360 స్టాక్స్ ఇన్వెస్టర్ల సంపదకు రెండింతల లాభాలను అందించాయి. 155 స్టాక్స్ 250 శాతం చొప్పున లాభాలు అందించాయి. కొన్ని స్టాక్స్ మాత్రమే రెండింతల లాభాలు ఇవ్వలేకపోయాయి.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications