For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కరోజే రూ.3.71 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా?

|

స్టాక్ మార్కెట్ మంగళవారం భారీగా నష్టపోయింది. కొత్త క్యాలెండర్ ఏడాది 2022లో ఇది అతిపెద్ద నష్టం. సెన్సెక్స్ ఏకంగా 554 పాయింట్లు, నిఫ్టీ 195 పాయింట్లు పతనమయ్యాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సూచీలపై చమురు ప్రభావం కనిపించింది. దీనికి తోడు తెరపైకి బాండ్ యీల్డ్స్ భయాలు వచ్చాయి. ప్రపంచ మార్కెట్ నుండి ప్రతికూల సంకేతాలు రావడంతో భారత మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయంగా రూపాయి క్షీణత కూడా ప్రభావం చూపింది.

ఉదయం దాదాపు స్థిరంగా ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నం వరకు స్వల్ప నష్టాల్లోనే కనిపించినప్పటికీ, చివరి గంటలో అంతకంతకూ పతనమైంది.

భారీ నష్టాలకు కారణాలు

భారీ నష్టాలకు కారణాలు

అంతర్జాతీయ ప్రతికూలతలకు తోడు ముడి చమురు ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో సూచీలు ఒక శాతం మేర పడిపోయాయి. వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో అమెరికా బాండ్స్ రాబడుల పెరుగుదలకు కారణం అయ్యాయి. బ్యారెల్ ముడిచమురు ధర 88 డాలర్ల ఎగువకు దూసుకెళ్లింది. దీంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి.

యూఏఈ రాజధానిలోని చమురు కేంద్రంపై దాడి కలవర పెట్టింది. ఈ ప్రభావం మన సూచీలపై పడింది. ముఖ్యంగా చివరి గంటన్నరలో ట్రేడింగ్‌లో ఆటో, మెటల్, రియాల్టీ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 33 పైసలు క్షీణించి రెండు వారాల కనిష్టం 74.58 వద్ద ముగిసింది.

రూ.3.71 లక్షల కోట్లు ఆవిరి

రూ.3.71 లక్షల కోట్లు ఆవిరి

నిన్న సూచీలు భారీగా క్షీణించడంతో ఇన్వెస్టర్లు మంగళవారం ఒక్కరోజే రూ.3.78 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా బీఎస్ఈ లిస్టింగ్ కంపెనీల మార్కెట్ క్యాప్ తగ్గింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.276.24 కోట్లకు చేరింది.

దీర్ఘకాలానికి

దీర్ఘకాలానికి

మార్కెట్ డిప్ సమయంలో పెట్టుబడులు పెట్టవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఇది ఎక్కువగా దీర్ఘకాలానికి సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్‌కు వర్తిస్తుంది. క్యాపెక్స్ సైకిల్‌లో మంచి లిఫ్టింగ్ కమోడిటీ కంపెనీల్లో కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, డిజిటల్ ఎక్విప్‌మెంట్, ఆటో, కెమికల్స్ వంటి తక్కువ మూలధనంతో కూడిన రంగాల్లో కూడా ప్రభుత్వ PLI స్కీం ద్వారా ప్రయోజనం పొందాయి. వివిధ పెద్ద కంపెనీలు చిన్న చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. రెండోది ఆయా కంపెనీల ఆర్థిక లభ్యతను గుర్తించాలి. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని, డిప్ సమయంలో లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

English summary

ఒక్కరోజే రూ.3.71 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా? | Sensex skids 554 points: Is the best time for investments?

The availability of financial resources. The cash flows of capital intensive companies have improved a lot over the last several years.
Story first published: Wednesday, January 19, 2022, 8:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X