భారీ లాభాల నుండి స్వల్ప లాభాల్లోకి: ఈ స్టాక్స్ 15%తో అదరగొట్టాయి
స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నం సమయానికి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఆ తర్వాత కాస్త క్షీణించినప్పటికీ చివరకు లాభాల్లో ముగిశాయి. 30 షేర్ బీఎస్ఈ బెంచ్‌మార్క్ గతవారం 1,293.48 పాయింట్లు లేదా 2.20 శాతం లాభపడింది. ఈసారి కూడా మార్కెట్ కాస్త సానుకూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. నిఫ్టీ తొలిసారి 18,000 మార్కును దాటింది. చివరకు ఇంట్రాడే లాభాలను కోల్పోయిన సూచీలు నష్టాల్లోకి మాత్రం వెళ్లలేదు.

సరికొత్త గరిష్టాలకు
అంతర్జాతీయ సానుకూలతలతో పాటు దేశీయంగా రిలయన్స్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ షేర్లు జీవితకాల గరిష్ఠానికి చేరుకోవడంతో సూచీలు పరుగులు పెట్టాయి. సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. రెండో త్రైమాసిక ఫలితాలపై ఆశాజనక వాతావరణం సూచీలకు అండగా నిలిచింది. ఇక కరోనా నుండి ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందనే పలు నివేదికలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఆటో ర్యాలీ ఎగిసిడింది. దీంతో నిఫ్టీ 18000 మార్కును తొలిసారి అందుకుంది. ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా అద్భుతంగా రాణించాయి.

ఆల్ టైమ్ గరిష్టానికి మార్కెట్
సెన్సెక్స్ 60,099.68 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,476.13 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,811.42 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,867.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,041.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,839.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 76.72 (0.13%) పాయింట్లు లాభపడి 60,135.78 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50.75 (0.28%) పాయింట్లు లాభపడి 17,945.95 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌కు ఆల్ టైమ్ గరిష్టం నేటి 60,476 పాయింట్లే. అలాగే నిఫ్టీకి కూడా ఆల్ టైమ్ గరిష్టం నేటి 18,041.95 పాయింట్లే.

ఆకట్టుకోలేక..
సెన్సెక్స్ 30 సూచీలో మారుతీ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఐటీసీ, ఎస్బీఐ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, HDFC బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ స్టాక్స్ లాభపడ్డాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, HCL టెక్, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు నష్టపోయాయి.
స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఇన్వెస్టర్లను అంతగా ఆకర్షించలేకపోయింది. తొలిరోజు బీఎస్ఈలో రూ.712 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.715 వద్ద ఫ్లాట్‌గా లిస్ట్ అయింది. దాదాపు రోజంతా ఐపీఓ ధర శ్రేణిలో కదలాడింది. రూ.721 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు రూ.698 వద్ద కనిష్ఠస్థాయిలో ముగిసింది. రూ.695-712 ధరల శ్రేణి మధ్య ఈ కంపెనీ ఐపీఓకి వచ్చింది.

ఈ స్టాక్స్ అదుర్స్
నేడు మార్కెట్లు దాదాపు ఫ్లాట్‌గా ముగిసినప్పటికీ పలు స్టాక్స్ మాత్రం దాదాపు 15 శాతం అంతకంటే లాభపడ్డాయి. 30 షేర్ బీఎస్ఈ ఇండెక్స్ 76 పాయింట్లు, 50 షేర్ ఎన్ఎస్ఈ 50 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 50లో 33 స్టాక్స్ లాభాల్లో, 17 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. కాగా, భారీగా లాభపడిన వాటిలో TAAL ఎంటర్‌ప్రైజెస్(20.0%), కిర్లోస్కర్ ఎలక్ట్రికల్స్ (20.0%), ప్రివెస్ట్ డెన్‌ప్రో లిమిటెడ్(20.0%), క్రానెక్స్ Ltd(20.0%), GOCL కార్పోరేషన్ (20.0%), ఉజాస్ ఎనర్జీ (20.0%), శివ సిమెంట్(20.0%), ఫార్మాయిడ్స్ ఫార్మ్(20.0%), నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్ Ltd.(20.0%), Nxt డిజిటల్(19.99%).


Click it and Unblock the Notifications