మళ్లీ భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు: ఈ స్టాక్స్ 15% పైగా లాభాలతో అదరగొట్టాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (అక్టోబర్ 7) భారీ లాభాల్లో ముగిశాయి. గతవారం భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, ఈ వారం రెండు ప్రారంభ సెషన్‌లలో లాభపడ్డాయి. సోమ, మంగళవారం సెషన్స్‌లో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడినప్పటికీ, నిన్నటి సెషన్‌లో 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నేడు తిరిగి లాభాల్లోకి వచ్చింది. నిన్నటి నష్టాలు నేడు దాదాపు రికవరీ అయ్యాయి. ప్రధానంగా రియాల్టీ, ఆటో స్టాక్స్, టీసీఎస్, టైటాన్ స్టాక్స్ భారీ లాభాలకు కారణమయ్యాయి. ఆటో, రియాల్టీలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 59,600 పాయింట్లను దాటగా, నిఫ్టీ 17,800 పాయింట్లకు చేరువైంది. సెన్సెక్స్, నిఫ్టీ చెరో 0.82 శాతం లాభపడ్డాయి.

అందుకే లాభాల్లోకి మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూల సంకేతాల కారణంగా ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అలాగే, ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్ష, ఈ నెలలో వెలువడనున్న కంపెనీల త్రైమాసిక ఫలితాల పట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఫైనాన్స్, ఆటోమొబైల్, రియల్టీ రంగాల షేర్లు రాణించడంతో సూచీలు రోజంతా లాభాల్లో కనిపించాయి.
చమురు, గ్యాస్ రంగాలు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఆటో సూచీలు 4 శాతం నుండి 6 శాతం మేర లాభపడ్డాయి. టైటాన్ స్టాక్ అయితే పది శాతానికి పైగా లాభపడింది. ఈ స్టాక్ నేడు రూ.226 పెరిగి రూ.2,374 వద్ద ముగిసింది. మార్కెట్లు గతవారం భారీగా నష్టపోయిన మార్కెట్లు, నేడు కాస్త ఊగిసలాటలో కనిపిస్తున్నాయి.

ఈ స్టాక్స్ జంప్
ఉదయం 59,632.81 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 59,914.91 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,597.06 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 17,810.55 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ, 17,857.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,763.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 488.10 (0.82%) పాయింట్లు లాభపడి 59,677.83 పాయింట్ల వద్ద, నిఫ్టీ +144.35 (0.82%) పాయింట్లు ఎగిసి 17,790.35 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఐచర్ మోటార్స్ భారీగా లాభపడ్డాయి. ఓఎన్జీసీ, రెడ్డీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, బ్రిటానియా, HDFC షేర్లు నష్టపోయాయి. 30 స్టాక్స్‌లో పది స్టాక్స్ నష్టపోగా, 20 స్టాక్స్ లాభపడ్డాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 12.04 శాతం, టైటాన్ కంపెనీ 10.60 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 5.29 శాతం, మారుతీ సుజుకీ 4.07 శాతం, ఐచర్ మోటార్స్ 3.37 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ 4.58 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.32 శాతం, కోల్ ఇండియా 1.11 శాతం, బ్రిటానియా 0.96 శాతం, HDFC 0.87 శాతం నష్టపోయాయి.

ఈ స్టాక్స్ జంప్
నేడు ఓ సమయంలో పలు స్టాక్స్ పదిహేను శాతం మేర లాభపడ్డాయి. వైట్ ఆర్గానిక్ ఆగ్రో (20.0%), నాధనా నైట్రో (20.0%), అంబికా అగరబత్తీస్ & అరోమా ఇండస్ట్రీస్ లిమిటెడ్ (20.0%), నీల్ ఇండస్ట్రీస్ (20.0%), బనారస్ బీడ్స్ (20.0%), న్యూరేకా లిమిటెడ్ (20.0%), DRC సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (19.99%), తేజ్ నక్ష్ హెల్త్ కేర్ (19.98%), పాలీమెక్ మ్యాక్ (19.98%) వాస్వాని ఇండ్ (19.96%) లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications